For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Investment: ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు మెచ్చిన స్టాక్.. ఐసీఐసీఐ, సింగపూర్ సంస్థ కొనుగోళ్లు..

|

Investment: ఇటీవల భారత కంపెనీల్లో అనేక అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ గోల్డ్‌మన్ సాచ్స్ ఇండిగో పెయింట్స్ లిమిటెడ్ షేర్లను కొనుగోలు చేసింది. 2021లో ఐపీవోగా వచ్చిన ఇండిగో పెయింట్స్ లో ICICI సైతం తన వాటాలను పెంచుకుంది.

ఇండిగో పెయింట్స్..

ఇండిగో పెయింట్స్..

గోల్డ్‌మన్ సాచ్స్ (సింగపూర్) కన్ను ఇండిగో పెయింట్స్ పై పడింది. తాజాగా కంపెనీకి సంబంధించిన 2,67,000 షేర్లను ఒక్కొక్కటి రూ. 1,343 చెల్లించి కొనుగోలు చేసింది. దీంతో మెుత్తం పెట్టుబడి విలువ రూ.35.85 కోట్లకు చేరుకుంది.

ఐసీఐసీఐ వాటాలు..

ఐసీఐసీఐ వాటాలు..

ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇండిగో పెయింట్స్ లో తన వాటాను పెంచుకుంది. నవంబర్ 9, 2022న ఒక్కో షేరును రూ.1,343 చొప్పున బ్లాక్ డీల్‌లో కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఐసీఐసీఐ ఏకంగా 2,50,000 షేర్లను కొనుగోలు చేసింది. దీంతో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాటాల విలువ రూ.33.57 కోట్లకు చేరుకుంది. జూలై- సెప్టెంబర్ 2022 కాలంలో ఇండిగో పెయింట్స్ కంపెనీలో బీమా కంపెనీ 6,75,906 షేర్లు లేదా 1.42 శాతం వాటాను కలిగి ఉంది. తాజా కొనుగోలుతో మరో 0.53 శాతం వాటా పెరగనుంది.

ఇతర ఇన్వెస్టర్లు..

ఇతర ఇన్వెస్టర్లు..

అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, అశోక ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్, స్మాల్-క్యాప్ వరల్డ్ ఫండ్.. ఇండిగో పెయింట్స్‌లో వాటాను కలిగి ఉన్న ఇతర ప్రముఖ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు). జూలై-సెప్టెంబర్ 2022 త్రైమాసికంలో ఇండిగో పెయింట్స్ కంపెనీలో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 6,41,953 షేర్లు లేదా 1.35 శాతం కలిగి ఉంది. అశోక ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ 8,84,600 షేర్లు లేదా 1.86 శాతం వాటాను కలిగి ఉంది. స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ కంపెనీలో 11,03,244 షేర్లు లేదా 2.32 శాతం వాటాలను హోల్డ్ చేస్తోంది.

షేర్ ధర చరిత్ర..

షేర్ ధర చరిత్ర..

ఇండిగో పెయింట్స్ జనవరి 2021లో ఐపీవోగా మార్కెట్లోకి వచ్చింది. అప్పట్లో షేర్ ప్రైస్ బ్యాండ్ రూ.1488 - రూ.1490 మధ్య కంపెనీ నిర్ణయించింది. అయితే ఫిబ్రవరి 2021లో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రూ.2607.50 వద్ద లిస్ట్ చేయబడింది. లిస్టింగ్ రోజు స్టాక్ NSEలో రూ.3117.15 వద్ద, BSEలో రూ.3118.65 వద్ద ముగిసింది. ఒక్కరోజే ఇన్వెస్టర్ల డబ్బు ఏకంగా రెండింతలైంది. అయితే ఏడాది ప్రాతిపధికన స్టాక్ ధర 30 శాతానికి పైగా క్షీణించింది.

English summary

Investment: ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు మెచ్చిన స్టాక్.. ఐసీఐసీఐ, సింగపూర్ సంస్థ కొనుగోళ్లు.. | Goldman sachs, icici prudentials increased stake in indigo paints company

Goldman sachs, icici prudential increased stake in indigo paints company
Story first published: Thursday, November 10, 2022, 15:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X