For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ రూ.49,000కి పసిడి, బంగారం ధరలు మరింత పెరుగుతాయా?

|

గతవారం రోజులుగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నాయి. వరుసగా పెరుగుతున్న గోల్డ్ ఫ్యూచర్ క్రితం సెషన్‌లో మాత్రం స్వల్పంగా తగ్గాయి. అయినప్పటికీ పసిడి రూ.46,600కు పైనే ఉంది. ఓ సమయంలో రూ.44,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.46,600 పైన ఉంది. ఇటీవలి కనిష్టంతో పోలిస్తే రూ.3వేల వరకు పెరిగింది. స్మాల్ సేవింగ్ యీల్డ్స్ తగ్గడం, రూపాయి మారకం క్షీణించడం వంటి వివిధ అంశాలు ఇందుకు కారణం.

జనవరి-మార్చిలో హౌసింగ్ సేల్స్ జంప్, హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరుజనవరి-మార్చిలో హౌసింగ్ సేల్స్ జంప్, హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు

మళ్లీ రూ.49,000కు బంగారం ధరలు?

మళ్లీ రూ.49,000కు బంగారం ధరలు?

అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మున్ముందు ఎలా ఉంటుందనేది అందరికీ ఆసక్తిని రేకెత్తించే అంశం. ద్రవ్యోల్భణం పెరగడం, కరోనా కేసులు తిరిగి ఎక్కువ అవుతుండటం వంటి అంశాలు బంగారం పెరుగుదలకు దోహదపడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.49,000ను క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాబట్టి సమీప భవిష్యత్తులో బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు ఇప్పుడే తీసుకోవడం సరైన చర్యగా చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల నుండి 1820 డాలర్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

నిపుణులు ఏం చెప్పారంటే

నిపుణులు ఏం చెప్పారంటే

ప్రస్తుతం పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 1740 డాలర్ల నుండి 1750 డాలర్ల మధ్య కదలాడుతున్నాయని, కరోనా కేసులు ఇలాగే పెరిగితే 1800 డాలర్ల నుండి 1820 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉంటాయని, దీంతో అంతర్జాతీయ మార్కెట్లో రూ.48,000 క్రాస్ కావొచ్చునని IIFL సెక్యూరిటీస్ కమోడిటీస్ అండ్ కరెన్సీ ట్రేడ్ వైస్ ప్రెసిడెంట్ అనుజ్ గుప్తా అన్నారు.

ఫ్యూచర్ మార్కెట్లో...

ఫ్యూచర్ మార్కెట్లో...

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.46,610 వద్ద క్లోజ్ అయింది. గత వారం అంతా పెరిగిన బంగారం, చివరి సెషన్‌లో మాత్రం రూ.228.00 వద్ద క్లోజ్ అయింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.245.00 (-0.52%) క్షీణించి రూ.46,824.00 వద్ద క్లోజ్ అయింది.

వెండి కిలో క్రితం సెషన్లో రూ.540.00 (-0.80%) తగ్గి రూ.66961.00 వద్ద, సిల్వర్ జూలై ఫ్యూచర్స్ రూ.467.00 (-0.68%) తగ్గి రూ.68,051 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.13.60 (0.77%) డాలర్లు తగ్గి 1,744.60 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.270 (1.06%) డాలర్లు తగ్గి 25.315 డాలర్ల వద్ద క్లోజ్ అయింది.

English summary

మళ్లీ రూ.49,000కి పసిడి, బంగారం ధరలు మరింత పెరుగుతాయా? | Golden opportunity for investors: Experts predict big rally in yellow metal price

Gold Price is rising in both domestic and international markets. According to commodity experts, ₹228 dip in gold price yesterday is a good opportunity for gold buyers as the yellow metal is heading for a big breakout.
Story first published: Sunday, April 11, 2021, 12:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X