For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంతర్జాతీయ మార్కెట్లో $2,000 డాలర్లకు బంగారం, ఇండియాలో రూ.50వేలకు

|

చైనా మహమ్మారి కరోనా వైరస్ (COVID-19) కారణంగా అతి ఖరీదైన మెటల్స్ ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర అంతకంతకూ పెరుగుతోంది. కరోనా వైరస్ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత బంగారం వైపు చూస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ ప్రభావం పడుతోంది. దీనికి తోడు డాలరుతో రూపాయి మారకం విలువ ప్రభావం చూపుతోంది.

భారీగా పెరిగిన బంగారం ధర: రూ.42,000 దాటి... రూ.45,000 దిశగా!భారీగా పెరిగిన బంగారం ధర: రూ.42,000 దాటి... రూ.45,000 దిశగా!

ఏడేళ్ల గరిష్టనికి..

ఏడేళ్ల గరిష్టనికి..

బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఏడు సంవత్సరాల గరిష్టానికి చేరుకుంది. ఏడాదిలో 2,000 డాలర్ల సమీపానికి చేరుకుంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం సురక్షిత బంగారం వైపు వెళ్లాలా లేక పెట్టుబడులు పెట్టాలా అనే కన్ఫ్యూజన్‌లోను కొంతమంది పెట్టుబడిదారులు ఉన్నారని చెబుతున్నారు. పెట్టుబడులు మొత్తం ఇటువైపు మరలితే ధర మరింతగా పెరగనుంది.

2,000 డాలర్లకు బంగారం

2,000 డాలర్లకు బంగారం

వచ్చే ఏడాది ముగిసేలోపు బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,000 చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని చెబుతున్నారు. బుధవారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో 0.5 శాతం లేదా 8.20 డాలర్లు పెరిగి 1,611.80 డాలర్లకు చేరుకుంది. తద్వారా మార్చి 2013 తర్వాత ఇది గరిష్ట ధర.

అందుకే అన్నీ జోరు..

అందుకే అన్నీ జోరు..

కరోనా వైరస్ ప్రభావంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులు రక్షణాత్మక ధోరణిలో ఉన్నారని, అమెరికా డాలర్, స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ సెంట్రల్ బ్యాంక్స్ ఆర్థికవ్యవస్థను కుంటుపడనీయకుండా ఉండేందుకు చర్యలు చేపడతాయన్న ఉద్దేశంతో బంగారం, వెండితో పాటు మార్కెట్లు జోరు మీద ఉన్నాయని చెబుతున్నారు.

అక్కడ పెరిగితే.. రూ.50,000కు

అక్కడ పెరిగితే.. రూ.50,000కు

పన్నెండు నుండి 24 నెలల్లో బంగారం ఔన్స్ 2,000 డాలర్లకు చేరుకునే అవకాశముందని చెబుతున్నారు. అంటే మన వద్ద రూ.48,000కు చేరుకుంటుంది. 2000 డాలర్లకు చేరుకుంటే దేశీయ మార్కెట్లో బంగారం ధర రూ.50,000కు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

English summary

అంతర్జాతీయ మార్కెట్లో $2,000 డాలర్లకు బంగారం, ఇండియాలో రూ.50వేలకు | Gold to record prices of $2,000 and beyond

Gold prices now trade at their highest levels in almost seven years, as the economic impact of the COVID-19 epidemic in China has raised expectations for stimulus from global central banks to sustain economic growth, feeding talk of record $2,000-an-ounce prices and beyond for the precious metal.
Story first published: Thursday, February 20, 2020, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X