భారీగా పడిపోయిన బంగారం ధర, రూ.1200 డౌన్! గోల్డ్@49,000, రూ.2,000 తగ్గిన వెండి

ముంబై: బంగారం ధరలు అంతకంతకూ క్షీణిస్తున్నాయి. ఈ రోజు (నవంబర్ 24) ఫ్యూచర్ మార్కెట్లో మరో రూ.400కు పైగా క్షీణించిన పసిడి రూ.49,000 స్థాయికి వచ్చింది. గత రెండు వారాల్లో రూ.1900 వరకు తగ్గిన పసిడి, నిన్న రూ.700కు పైగా, నేడు రూ.400కు పైగా తగ్గింది. రెండు రోజుల్లోనే రూ.1200 వరకు క్షీణించింది. గత గత పదిహేను రోజుల్లో రూ.3,000కు పైగా తగ్గింది.

నిన్న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 732.00 (-1.46%) క్షీణించి రూ.49,480.00 వద్ద, ఫిబ్రవరి ఫ్యూచర్స్ 756.00 (-1.51%) క్షీణించి రూ.49,470.00 వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1,628.00 (-2.62%) క్షీణించి రూ.60,530.00 వద్ద, మార్చి ఫ్యూచర్స్ రూ.1,573.00 (-2.46%) తగ్గి రూ.62402.00 వద్ద ముగిసింది.

రూ.49,000కు దిగి వచ్చిన బంగారం

రూ.49,000కు దిగి వచ్చిన బంగారం

నేడు ప్రారంభ సెషన్లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 453.00 (-0.92%) క్షీణించి రూ.49,022.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,262.00 వద్ద ప్రారంభం కాగా, రూ.49,262.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,027.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ పది గ్రాములు రూ.404.00 (-0.82%) పడిపోయి రూ.49061.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,050.00 వద్ద ప్రారంభమై, రూ.49,115.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,029.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

2 రోజుల్లో రూ.2వేలు తగ్గిన వెండి

2 రోజుల్లో రూ.2వేలు తగ్గిన వెండి

నిన్న రూ.1500కు పైగా తగ్గిన వెండి నేడు మరింత క్షీణించింది. రూ.60వేల దిగువకు వచ్చింది. రూ.620.00 (-1.02%) క్షీణించి రూ.రూ.59,905.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.60,064.00 వద్ద ప్రారంభమై, రూ.60,064.00 వద్ద గరిష్టాన్ని, రూ.59,840.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వెండి ఈ రోజు రోజుల్లో రూ.2000కు పైగా తగ్గింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.599.00 (-0.96%) క్షీణించి రూ.రూ.61760.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.62,000.00 వద్ద ప్రారంభమై, రూ.62,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,405.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిశగా...

1800 డాలర్ల దిశగా...

అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ భారీగా పడిపోయింది. ఈ రోజు 15.85(-0.86%) డాలర్లు క్షీణించి ఔన్స్ ధర 1,821.85 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఇప్పటికే 1850 డాలర్ల కిందకు దిగి వచ్చిన గోల్డ్ 1800 దిశగా కనిపిస్తోంది. 1,818.95 - 1,836.90 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ ఏడాది పసిడి 25.37 శాతం పెరిగింది. క్రితం సెషన్లో 1838 డాలర్ల వద్ద ముగిసింది.

సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.211 (-0.89%) డాలర్లు క్షీణించి 23.422 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 23.253 - 23.650 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 37 శాతం పెరిగింది. క్రితం సెషన్లో 23.633 డాలర్ల వద్ద ముగిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+