వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..
బంగారం ధరలు పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. ఇరాన్ యుద్ధంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పెట్టుబడిదారులు Gold మీదనే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి. డాలర్ బలహీన పడటం కూడా బంగారం ర్యాలీకి కలిసి వస్తోంది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్, ఫారెక్స్ & కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర బంగారం, వెండి ధరలపై తన అంచనాలు తెలిపారు. వాటిని ఓ సారి పరిశీలిద్దాం.
ఆయన అంచనాల ప్రకారం.. MCX మార్కెట్‌లో Gold ధరలు ప్రస్తుతం బలమైన స్థితిలో కొనసాగుతున్నాయి. వారపు చార్ట్‌ను పరిశీలిస్తే.. ఇటీవల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత స్వల్పంగా కరెక్షన్ వచ్చినప్పటికీ, మళ్లీ స్థిరమైన పరిధిలోకి చేరుకుని సైడ్‌వేస్ నుంచి బుల్లిష్ ట్రెండ్ వైపు కదులుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా పెరుగుతున్న ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని బంగారం తిరిగి పైకి ఎగసిన విధానం మార్కెట్‌లో బలమైన కొనుగోలు ఆసక్తిని సూచిస్తోంది.

ఈ ట్రెండ్ కొనసాగాలంటే..రూ. 1,58,000 స్థాయి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గత వారం కనిష్ట స్థాయికి సమీపంగా ఉండటంతో, టెక్నికల్‌గా బలమైన సపోర్ట్‌గా భావిస్తున్నారు. ధరలు ఈ స్థాయి కంటే పైన నిలబడినంతకాలం.. మార్కెట్‌లో బుల్లిష్ భావన కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువకు స్పష్టంగా క్లోజ్ అయితే.. మరింత లోతైన కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే.. బంగారం ధరలు పాజిటివ్ మొమెంటంతో ముందుకు సాగుతున్నాయి.
ఇక రాబోయే రోజుల్లో బంగారం ధరలు రూ. 1,72,000 స్థాయిని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం ర్యాలీ కొనసాగుతున్న సంకేతమే కాకుండా, పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. వీక్లీ కన్సాలిడేషన్‌లో ధరలు స్థిరంగా ఉండటం కూడా మార్కెట్‌లో స్థిరమైన బలాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో, స్వల్పంగా ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయడం ఒక మంచి వ్యూహంగా పరిగణించవచ్చు.
ప్రస్తుతం MCX గోల్డ్ ట్రేడింగ్ వ్యూహం ప్రకారం.. CMP రూ. 1,63,700 వద్ద ఉంది. లక్ష్యంగా రూ. 1,72,000ను భావిస్తుండగా.. రిస్క్ మేనేజ్‌మెంట్ కోసం రూ. 1,58,000 వద్ద స్టాప్ లాస్ ఉంచడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
ఇక వెండి విషయానికి వస్తే.. అది కూడా బలమైన పుంజుకోవడం చూపుతోంది. వారపు చార్ట్‌లో చూస్తే, వెండి వరుసగా మూడు వారాలు తన కనిష్ట స్థాయిల పైనే ట్రేడ్ అవుతూ ఉంది. ఇది మార్కెట్‌లో బలమైన రికవరీని సూచిస్తోంది. ప్రస్తుతం ధరలు ఒక ముఖ్యమైన రెసిస్టెన్స్ జోన్‌కు సమీపిస్తున్నాయి, ఇది బ్రేక్ అయితే మరింత వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
వెండి ధరల కోసం రూ. 2,54,000 స్థాయి కీలక సపోర్ట్‌గా ఉంది. ఈ స్థాయి కంటే పైన ఉన్నంతకాలం, మార్కెట్ బుల్లిష్‌గా కొనసాగుతుంది. ఒకవేళ ఈ స్థాయి కంటే దిగువకు వెళితే మాత్రం బలహీనత సంకేతాలు కనిపించవచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే, ఏ చిన్న తగ్గుదల వచ్చినా కొనుగోలు ఆసక్తి పెరుగుతోంది. ఇక టార్గెట్ విషయానికి వస్తే వెండి ధరలు త్వరలోనే రూ. 3,00,000 స్థాయిని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థాయి చాలా ముఖ్యమైన రెసిస్టెన్స్‌గా భావిస్తున్నారు. ధరలు ఈ దిశగా క్రమంగా కదులుతున్నాయి.
ప్రస్తుతం MCX సిల్వర్ ట్రేడింగ్ వ్యూహం ప్రకారం, CMP రూ. 2,75,300 వద్ద ఉంది. లక్ష్యంగా రూ. 3,00,000ను భావిస్తుండగా, స్టాప్ లాస్ రూ. 2,54,000 వద్ద ఉంచడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే బంగారం, వెండి రెండూ సైడ్‌వేస్ నుంచి బుల్లిష్ ట్రెండ్ వైపు కదులుతున్నాయి. కీలక సపోర్ట్ స్థాయిల పైన ఉన్నంతకాలం, ఈ పెరుగుదల ధోరణి కొనసాగుతూ పెట్టుబడిదారులకు మంచి అవకాశాలను అందించే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications