For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్యూచర్‌లో తగ్గి, రిటైల్ మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం ధర: రూ.74,000 ముద్దాడిన వెండి

|

దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,500 స్థాయికి చేరుకొని, రూ.48,300 దిగువన ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.74,000 క్రాస్ చేసి పరుగులు పెట్టినట్లే కనిపించినా సాయంత్రానికి అతి స్వల్పంగా రూ.247 తగ్గింది. రిటైల్ మార్కెట్లో మాత్రం ధరలు రూ.300కు పైగా పెరిగాయి. ఢిల్లీలో రూ.333 పెరిగి రూ.47,833కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ ఏర్పడింది. డాలర్ బలహీనపడటంతో పసిడి ధరలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.50వేలకు పైగా ట్రేడ్ అవుతోంది. సోమవారం రూ.49,260 వద్ద ముగిసింది.

బంగారం ధరల్లో తగ్గుదల

బంగారం ధరల్లో తగ్గుదల

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్లో రూ.179.00 (0.37%) క్షీణించి రూ.48295.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,419.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,490.00 గరిష్టాన్ని, రూ.48,215.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.152.00 (0.31%) తగ్గి రూ.48817.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,983.00 వద్ద ప్రారంభమై, రూ.49,004.00 గరిష్టాన్ని, రూ.48,720.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

నేటి గరిష్టం నుండి రూ.1200 డౌన్

నేటి గరిష్టం నుండి రూ.1200 డౌన్

ఓ వైపు బంగారం ధరలు తగ్గగా, వెండి ధరలు ఉదయం పెరిగి, సాయంత్రానికి స్వల్పంగా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.538.00 (0.73%) పెరిగి రూ.73862.00 వద్ద ట్రేడ్ కాగా, సాయంత్రానికి రూ.247.00 (0.34%) తగ్గి రూ.73,077 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఓ సమయంలో రూ.74,200 దాటింది. ఆ తర్వాత 1200 వరకు పడిపోయింది. రూ.73,755.00 వద్ద ప్రారంభమై, రూ.74,222.00 గరిష్టాన్ని, రూ.72,060.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.111.00 (0.15%) తగ్గి రూ.74260.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.75,075.00 ప్రారంభమైన ధర, రూ.75,2015.00 వద్ద గరిష్టాన్ని, రూ.74,068.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల

అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుదల

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.25 (0.07%) డాలర్లు తగ్గి 1,866.35 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,863.75 - 1,875.85 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.024 (0.08%) డాలర్లు తగ్గి 28.250 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 28.203 - 28.890

డాలర్ల మధ్య కదలాడింది.

English summary

ఫ్యూచర్‌లో తగ్గి, రిటైల్ మార్కెట్లో భారీగా పెరిగిన బంగారం ధర: రూ.74,000 ముద్దాడిన వెండి | Gold rate: Yellow metal dips marginally, silver kisses Rs 74,000

Gold prices on Tuesday rose to their highest in more than three months as a weaker U.S. dollar and growing inflationary pressure lifted bullion's appeal as an inflation hedge. Precious metals continued the northward movement in the Indian market.
Story first published: Tuesday, May 18, 2021, 22:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X