For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold rate today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? నష్టాలు రాకముందే బయటపడండి!

|

నిన్న రూ.300కు పైగా పెరిగి రూ.47,000 క్రాస్ చేసిన బంగారం ధరలు నేడు (మంగళవారం, ఆగస్ట్ 17) స్థిరంగా ఉన్నాయి లేదా అతి స్వల్పంగా క్షీణించాయి. ఇటీవల రూ.47,000 దిగువన ట్రేడ్ అవుతున్న గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న రూ.47,225 చేరుకున్నాయి. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ప్రారంభ సెషన్‌లో రూ.6.00 (-0.01%) క్షీణించి రూ.47219.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.15.00 (0.03%) పెరిగి రూ.47417.00 వద్ద ట్రేడ్ అయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.143.00 (0.23%) లాభపడి రూ.63600.00 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.142.00 (0.22%) ఎగిసి రూ.64350.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న 10 డాలర్లకు పైగా పెరిగినప్పటికీ, నేడు స్వల్పంగా 2 డాలర్ల మేర తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ 2.05 (-0.11%) డాలర్లు క్షీణించి 1,787.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.064 (+0.27%) డాలర్లు పెరిగి 23.855 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం గతవారం భారీగా లాభపడింది. అయితే ఈ వారం మాత్రం దాదాపు స్థిరంగా కొనసాగుతోంది.

Gold rate today: Yellow metal prices stalls as UBS tells buyers to get out before losses

అంతర్జాతీయ ఎకానమీ రికవరీ పుంజుకుంటోందని, గ్రీన్ బ్యాంక్ వచ్చే ఏడాదికి మరింత బలపడవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం పెట్టుబడిపై లేదా బులియన్ హోల్డింగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అమెరికా జాబ్ డేటా అంచనాలకు మించి వృద్ధిని నమోదు చేసిందని చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు కూడా ఎకానమీకి అనుకూలంగా కొనసాగుతున్నాయని అంటున్నారు. డాలర్ క్రమంగా బలపడుతోందని, కాబట్టి బులియన్ హోల్డింగ్స్ పట్ల ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.

బంగారం ధరలు సమీప కాలంలో మరింత క్షీణించే అవకాశాలు లేకపోలేదని, దాని కంటే ముందే ఈ నష్టాల నుండి బయటపడే ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. అయితే హోల్డింగ్స్ పూర్తిగా జారవిడుచుకోవద్దని, దీర్ఘకాలంలో మాత్రం మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

English summary

Gold rate today: బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే? నష్టాలు రాకముందే బయటపడండి! | Gold rate today: Yellow metal prices stalls as UBS tells buyers to get out before losses

Gold slipped after finishing strongly last week, with UBS Group AG warning investors to rethink their bullion holdings as the global economy recovers and the greenback strengthens into next year.
Story first published: Tuesday, August 17, 2021, 10:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X