For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Rate Today: రూ.4000 తగ్గిన బంగారం ధరలు

|

బంగారం ధరలు భారీగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్ ధరలు నేటి సెషన్‌లో రూ.51,500 దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1920 డాలర్లకు దిగువన ఉంది. సిల్వర్ ఫ్యూచర్ ధరలు 67,500 దిగువన ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ ఓ సమయంలో రూ.55,000 క్రాస్ చేసింది. ఇప్పుడు రూ.51,500 దిగువకు వచ్చింది.

మధ్యాహ్నం గం.12 సమయానికి ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.19 క్షీణించి రూ.51,360 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.2 క్షీణించి రూ.51,705 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1918.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1,921.5 డాలర్ల వద్ద ముగిసింది. నేడు 1,915.70 - 1,924.55 డాలర్ల మధ్య కదలాడింది. బంగారం ధరలు ఈ కొద్ది రోజుల్లో రూ.4000 తగ్గింది.

Gold Rate Today: Gold Prices down by Rs 4000

ఎంసీఎక్స్‌లో మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.217 క్షీణించి రూ.67,475 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.181 తగ్గి రూ.68,304 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 24.892 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో 24.904 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 24.785 - 24.977 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold Rate Today: రూ.4000 తగ్గిన బంగారం ధరలు | Gold Rate Today: Gold Prices down by Rs 4000

Gold rates in India rose by Rs 4,000 on March 23, 2022 for 24-carat gold. The gold rates rose for 22-carat by Rs 3,500. The prices have been highly volatile owing to the ongoing Russia-Ukraine war.
Story first published: Wednesday, March 23, 2022, 12:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X