For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం, వెండి ధరలు, అప్పటి నుంచి రూ.2,000 తగ్గుదల

|

బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. అమెరికా - చైనా వాణిజ్య చర్చల డెవలప్‌మెంట్స్, జ్యువెల్లర్స్, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగింపు వంటి పాటు వివిధ అంతర్జాతీయ, జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి ధరలు కాస్త తగ్గాయి. ఎంసీఎక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్ 0.15 శాతం తగ్గి రూ.38,170 వద్ద ఉంది. ఎంసీఎక్స్ సిల్వర్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.12 శాతం తగ్గి రూ.44,630 వద్ద ఉంది. సెప్టెంబర్ రికార్డ్ హై రూ.40,000 దాటిన తర్వాతతో పోలిస్తే ఇప్పుడు రూ.2,000 తగ్గింది.

హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.39,500కు పైగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. దాదాపు రూ.100 తగ్గింది. వెండి కిలో ధర రూ.200 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 1,467 డాలర్లుగా ఉంది.

మోడీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం: రోజుకు 9 గంటలు వర్కింగ్ హవర్స్మోడీ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం: రోజుకు 9 గంటలు వర్కింగ్ హవర్స్

 Gold rate today: Gold loses sheen awaiting US-China trade deal developments

ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.100, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణెపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో దేశీయంగా డిమాండ్ తగ్గింది.

బంగారం ధరలు సోమవారం కూడా స్వల్పంగా తగ్గిన విషయం తెలిసిందే. ఎంసీఎక్స్ గోల్డ్ (డిసెంబర్) ఫ్యూచర్ 0.18 శాతం తగ్గి రూ.37,929, ఎంసీఎక్స్ సిల్వర్ (డిసెంబర్) ఫ్యూచర్స్ 0.46 శాతం తగ్గి రూ.44,241గా ఉంది. గత పది సెషన్ల నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గుతోంది. అక్టోబర్ 27వ తేదీన గోల్డ్ స్పాట్ (10 గ్రాములు) రూ.38,630, గోల్డ్ ఫ్యూచర్ (10 గ్రాములు) రూ.38289గా ఉంది. నాటి నుంచి ఈ రోజు వరకు దాదాపు రూ.600 వరకు తగ్గింది. హైదరాబాదులో నేడు (నవంబర్ 18) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.39,300గా ఉంది.

English summary

తగ్గిన బంగారం, వెండి ధరలు, అప్పటి నుంచి రూ.2,000 తగ్గుదల | Gold rate today: Gold loses sheen awaiting US-China trade deal developments

Gold and silver lost some sheen on Tuesday and traded with minor losses on domestic bourses amid a wait for developments in the US-China trade deal.
Story first published: Tuesday, November 19, 2019, 12:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X