For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తగ్గిన బంగారం ధరలు, హైదరాబాద్‌లో ధర ఎంతంటే?

|

బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్ గోల్డ్ (డిసెంబర్) ఫ్యూచర్ 0.18 శాతం తగ్గి రూ.37,929, ఎంసీఎక్స్ సిల్వర్ (డిసెంబర్) ఫ్యూచర్స్ 0.46 శాతం తగ్గి రూ.44,241గా ఉంది. గత పది సెషన్ల నుంచి బంగారం ధర స్వల్పంగా తగ్గుతోంది. అక్టోబర్ 27వ తేదీన గోల్డ్ స్పాట్ (10 గ్రాములు) రూ.38,630, గోల్డ్ ఫ్యూచర్ (10 గ్రాములు) రూ.38289గా ఉంది. నాటి నుంచి ఈ రోజు వరకు దాదాపు రూ.600 వరకు తగ్గింది. హైదరాబాదులో నేడు (నవంబర్ 18) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.39,300గా ఉంది.

అనూహ్యంగా కొద్దిరోజుల్లో బంగారం ధర రూ.2,000 ఎందుకు తగ్గింది? అప్పుడు మళ్లీ పెరుగుతుంది...అనూహ్యంగా కొద్దిరోజుల్లో బంగారం ధర రూ.2,000 ఎందుకు తగ్గింది? అప్పుడు మళ్లీ పెరుగుతుంది...

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.1 శాతం తగ్గి 1,465.62 డాలర్లుగా ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.1 శాతం తగ్గి 1,466.80 డాలర్లుగా ఉంది. టెక్నికల్ చార్ట్ ఆధారంగా స్పాట్ గోల్డ్ రేంజ్ ఔన్సుకు 1,462 నుంచి 1,472 మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Gold rate today: Gold eases amid improving global sentiment

కాగా, బంగారం డిసెంబర్ ఫ్యూచర్ ఈ వారం ఊగిసలాట మధ్య ఉండవచ్చునని నిపుణుల అభిప్రాయం. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ ఆందోళనకు తెరపడే అవకాశాలు ఉందనే అంచనాలు ఇందుకు దోహదం చేస్తాయని అంచనా. అయితే డిసెంబర్ ముగియనున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.

English summary

తగ్గిన బంగారం ధరలు, హైదరాబాద్‌లో ధర ఎంతంటే? | Gold rate today: Gold eases amid improving global sentiment

Bullion counters traded with cuts as sentiments improved in India, as well as in Asian after Beijing surprised markets by trimming a key interest rate for the first time since 2015.
Story first published: Monday, November 18, 2019, 13:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X