For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: వారంలో రూ.1200 తగ్గిన బంగారం ధరలు

|

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1800 డాలర్లకు పైన, దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.48,000కు దిగువన ట్రేడ్ అవుతోంది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో నిన్న 10 డాలర్ల మేర పెరిగి 1810 డాలర్లకు చేరుకుంది. నేడు మాత్రం స్వల్ప తగ్గుదలను నమోదు చేసింది. వెండి ధరలు కూడా క్రితం సెషన్‌లో పెరిగి, నేడు మళ్లీ తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు, యూఎస్ బాండ్ యీల్డ్స్, ఫెడ్ వడ్డీ రేటు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి.

గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు

గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సమయానికి రూ.9 పెరిగి రూ.47,931 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.57 క్షీణించి రూ.48,027 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 4.45 శాతం క్షీణించి 1805.90 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1810 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో 2 శాతం మేర క్షీణించింది.

సిల్వర్ ఫ్యూచర్స్

సిల్వర్ ఫ్యూచర్స్

ఎంసీఎక్స్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.368 తగ్గి రూ.61,135 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.354 తగ్గి రూ.61,900 వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.175 డాలర్లు తగ్గి 22.532 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 22.707 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఏడాదిలో 14.64 శాతం మారింది. నేటి సెషన్లో 22.525 - 22.657 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

రూ.1200 క్షీణించిన పసిడి

రూ.1200 క్షీణించిన పసిడి

నిన్న బంగారం ధరలు గతవారం రోజుల్లో రూ.1200 మేర క్షీణించింది. అదే సమయంలో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కొద్ది రోజుల క్రితం రూ.49,000 వద్ద ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు రూ.48,000కు దిగువకు పడిపోయాయి. అదే వెండి ఫ్యూచర్స్ రూ.61,000 దిగువ నుండి రూ.66,000 సమీపానికి చేరుకొని, ప్రస్తుతం రూ.61,000కు పైన ట్రేడ్ అవుతోంది.

English summary

Gold Prices Today: వారంలో రూ.1200 తగ్గిన బంగారం ధరలు | Gold Prices Today: Yellow metal to remain volatile amid global concerns

Gold was trading higher in the Indian market on February 3 even as international prices remained unchanged above the key $1,800 an ounce level after US Treasury yields retreated following a dip in the jobs data.
Story first published: Thursday, February 3, 2022, 12:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X