For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: పెరిగిన బంగారం ధర, ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.6,800 తక్కువ

|

ముంబై: బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. అయినప్పటికీ పది గ్రాములకు రూ.50,000కు దిగువనే ఉన్నాయి. నిన్న పసిడి ధరలు తగ్గాయి. అంతలోనే మళ్లీ పైపైకి చేరుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా పసిడి రూ.52వేల దిగువ నుండి రూ.48,000 పైన కదలాడుతున్నాయి. డాలర్ క్షీణించడం, యూఎస్ ట్రెజరీ యీల్డ్స్ తక్కువగా ట్రేడ్ కావడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. అమెరికా ఆర్థిక ప్యాకేజీ కూడా పెరుగుదలకు దోహదపడింది. పసిడి ధరలు ఇప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో రూ.6800 వరకు తక్కువగా ఉంది.

Gold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలుGold prices today: స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం రూ.49,000 పైకి

బంగారం రూ.49,000 పైకి

నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 335.00 (0.68%) పెరిగి రూ49380.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,130.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,447.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,130.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.6800 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.347.00 (0.71%) పెరిగి రూ.49381.00 వద్ద ప్రారంభమైంది. రూ.49,323.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,400.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,232.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర స్వల్పంగా జంప్

వెండి ధర స్వల్పంగా జంప్

సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.400.00 పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 383.00 (0.58%) పెరిగి రూ.66289.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.66,500.00 వద్ద ప్రారంభమై, రూ.66,500.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,177.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.517.00 (0.78%) పెరిగి రూ.67201.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,177.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,244.00 వద్ద గరిష్టాన్ని, రూ.667,158.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడ పైపైకి...

అక్కడ పైపైకి...

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్ల పైకి చేరుకుంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 16.10 (+0.87%) డాలర్లు పెరిగి 1,860.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,854.10 - 1,862.70 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17.64% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర 0.225 (+0.88%) డాలర్లు తగ్గి 25.660 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.547 - 25.785 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 40.09 శాతం పెరిగింది.

English summary

Gold prices today: పెరిగిన బంగారం ధర, ఆల్‌టైమ్ గరిష్టంతో రూ.6,800 తక్కువ | Gold prices today rise but still down Rs 6800 from record highs

Gold and silver moved higher in Indian markets, tracking positive global cues. On MCX, February gold futures were up 0.74% to ₹49,410 per 10 gram while silver prices gained 0.57% to ₹66,279 per kg. In the previous session, gold rates had eased 0.53%.
Story first published: Wednesday, January 13, 2021, 10:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X