బంగారం ధరలు నేడు పెరిగి, రికార్డ్ గరిష్టానికి చేరుకున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు అస్థిరంగా ఉన్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి నుండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ కాలంలోనే 25 శాతం వరకు పెరిగాయి. ఏడాదిలో 35 శాతం నుండి 40 శాతం మధ్య పెరిగాయి. ఇప్పుడు వివిధ కారణాలతో ఈ రోజు మళ్లీ గరిష్టానికి చేరుకున్నాయి.

రికార్డ్ స్థాయికి బంగారం ధర
ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్)లో ఉదయం గం.9.30 సమయానికి 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.4 శాతం పెరిగి రూ.48,982కు చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.8 శాతం ఎగిసి కిలో రూ.50,779 పలికింది. ఎంసీఎక్స్‌లో గత వారం బంగారం ధరలు రూ.48,500 పైకి చేరుకున్నాయి. ఇది గరిష్టం. ఇప్పుడు దానిని దాటి రికార్డ్ స్థాయికి చేరుకుంది. వెండి ధర కూడా రూ.50వేలు దాటింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఎనిమిదేళ్ల గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,782.21 డాలర్లు పలికింది. 2012 అక్టోబర్ నెలలో బంగారం ధర 1,785.46 పలికింది. ఇప్పుడు దానికి దగ్గరలో ఉంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 0.7 శాతం పెరిగి 822.50 డాలర్లు, వెడి 0.6 శాతం పెరిగి 18.24 డాలర్లుగా ఉంది.

రూ.50వేలు దాటిన బంగారం
ఇప్పటికే బయట బంగారం ధర 10 గ్రాములు రూ.50వేలు దాటింది. పరిస్థితులు ఇలాగే ఉంటే దీపావళి నాటికి రూ.52వేలు చేరుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో రూ.50,500 దాటింది. బంగారం ధరకు తోడు 2.5 శాతం ఇంపోర్ట్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications