For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధర, వెండి రూ.700కు పైగా డౌన్

|

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ రూ.51,000 పైనే ఉన్నాయి. అలాగే ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.5,000 తక్కువగా ఉంది. నిన్న బంగారం ధర రూ.500కు పైగా భారీగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు తిరోగమనంలో ఉంది. పది గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400 (0.78 శాతం) తగ్గి రూ.51,198 పలికింది. రూ.51,320 వద్ద ప్రారంభం కాగా, రూ.50,988 వద్ద కనిష్టాన్ని, రూ.51,465 వద్ద గరిష్టాన్ని తాకింది.త ఉదయం నుండి పసిడి ధరలు క్షీణతలోనే ఉన్నాయి. ప్రారంభంలో రూ.51,465 వద్ద గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత ఆ స్థాయికి చేరుకోలేదు. క్రమంగా తగ్గింది. ఓ సమయంలో రూ.51వేలకు స్వల్పంగా దిగువకు వచ్చింది.

Cylinder Customers Alert: ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ మారిపోయింది..Cylinder Customers Alert: ఇండేన్ గ్యాస్ బుకింగ్ నెంబర్ మారిపోయింది..

రూ.400 డౌన్

రూ.400 డౌన్

సాయంత్రానికి డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.400 క్షీణించగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.300కు పైగా తగ్గింది. రూ.306 (0.59 శాతం) తగ్గి రూ.51,402 వద్ద ట్రేడ్ అయింది. రూ.51,535 వద్ద ప్రారంభమైన పసిడి, రూ.51,620 వద్ద గరిష్టాన్ని, రూ.51,184 వద్ద కనిష్టాన్ని తాకింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి రూ.51వేల స్థాయిలోనే మరికొద్దికాలం కొనసాగవచ్చునని అంటున్నారు. రూ.50,900 వద్ద బలమైన మద్దతు, నిరోధకస్థాయి రూ.51,300-51,650 మధ్య, రూ.50,900-50,700 మధ్య మద్దతు ధర ఉండవచ్చు.

రూ.700కు పైగా తగ్గిన వెండి

రూ.700కు పైగా తగ్గిన వెండి

డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.765 క్షీణించి (1.22 శాతం) రూ.61,920 పలికింది. రూ.61,420.00 వద్ద ప్రారంభం కాగా, రూ.62,335.00 వద్ద గరిష్టాన్ని, రూ.60,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది.మార్చి ఫ్యూచర్స్ రూ.556 (0.86 శాతం) తగ్గి కిలో రూ.63851 పలికింది. రూ.63,452.00 ప్రారంభమైన ధర, రూ.63,896.00 వద్ద గరిష్టాన్ని, రూ.62,533.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అక్కడా తగ్గుదల

అక్కడా తగ్గుదల

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఔన్స్ 0.57 శాతం క్షీణించి 1,899.55 డాలర్లు పలికింది. 1,882.80 - 1,917.85 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఈ ఏడాది పసిడి 23.57 శాతం మేర పెరిగింది.

వెండి ఫ్యూచర్స్ ఔన్స్ 1.34 శాతం తగ్గి 24.017 డాలర్లు పలికింది. 23.275 - 24.595 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏఢాదిలో వెండి ఫ్యూచర్ 32 శాతానికి పైగా పెరిగింది.

English summary

భారీగా తగ్గిన బంగారం ధర, వెండి రూ.700కు పైగా డౌన్ | Gold prices today fall sharply, down ₹5000 from record highs

Gold and silver prices in India fell today as US elections headed towards a tight finish. On MCX, December gold futures were down 0.85% to ₹51,160 per 10 gram while silver rates slumped 2% to ₹61,380 per kg. In the previous session, both gold and silver futures had logged gains of over 1% each. In global markets, gold prices today moved lower amid a stronger US dollar.
Story first published: Wednesday, November 4, 2020, 22:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X