For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం, రూ.49,000 దిగువకు: వెండి రూ.500 వరకు డౌన్

|

ముంబై: దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు క్షీణించాయి. గతవారం రూ.50వేల పైకి చేరుకున్న గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (సోమవారం, 14, డిసెంబర్) రూ.49వేల దిగువకు వచ్చాయి. గత నాలుగు రోజుల్లో మూడు రోజులు క్షీణించింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా క్షీణించాయి. అగ్రరాజ్యం అమెరికా కరోనా వ్యాక్సీనేషన్ ప్రోగ్రాంను నేటి నుండి ప్రారంభించడానికి సిద్ధమైంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. అదే సమయంలో బంగారంపై ఒత్తిడితగ్గి, ధరలు తగ్గాయి. వ్యాక్సీనేషన్ నేపథ్యంలో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు ఎగిశాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 0.2 శాతం క్షీణించి 1,834.94 డాలర్ల వద్ద ఉంది.

చైనాకు శాంసంగ్ షాక్, మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు మరో అడుగుచైనాకు శాంసంగ్ షాక్, మోడీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కు మరో అడుగు

రూ.49,000 దిగువకు బంగారం

రూ.49,000 దిగువకు బంగారం

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.374.00 (-0.76%) క్షీణించి రూ.48,950 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,101.00 వద్ద ప్రారంభమై, రూ.49,132.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,945.00 కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7300 తక్కువగా ఉంది.

ఏప్రిల ఫ్యూచర్స్ రూ.375.00 (-0.76%) క్షీణించి రూ.49010.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,153.00 ప్రారంభమై, రూ.49,153.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,010.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.500 వరకు తగ్గిన వెండి

రూ.500 వరకు తగ్గిన వెండి

వెండి ధరలు కూడా క్షీణించాయి. మార్చి ఫ్యూచర్స్ సిల్వర్ రూ.473.00 (-0.74%) తగ్గి రూ.63262.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,482.00 వద్ద ప్రారంభమై, రూ.63,500.00 గరిష్టాన్ని, రూ.63,086.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే ఫ్యూచర్స్ రూ.362.00 (-0.56%) తగ్గి రూ.64178.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,991.00 ప్రారంభమై, రూ.64,178.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,991.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తిరోగమనంలో కనిపించాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 6.70 (-0.36%) క్షీణించి 1,836.95 వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,835.50 - 1,845.45 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో వెండి 22 శాతానికి పైగా పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.045 (-0.19%) తగ్గి 24.047 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 23.945 - 24.165 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ధర 40 శాతానికి పైగా పెరిగింది.

English summary

భారీగా తగ్గిన బంగారం, రూ.49,000 దిగువకు: వెండి రూ.500 వరకు డౌన్ | Gold prices today fall in 3rd day of decline in four days, silver rates drop

Gold and silver prices fell today in Indian markets, tracking weak global cues. On MCX, February gold futures slid 0.4% to ₹49,125 in their third decline in four days.
Story first published: Monday, December 14, 2020, 12:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X