For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు, ఫ్యూచర్ గోల్డ్ మాత్రం షాక్

|

బంగారం ధరలు గురువారం ఉదయం తగ్గాయి. ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.14 శాతం పడిపోయి 10 గ్రాములకు రూ.44,880గా ఉంది. అంతకుముందు గోల్డ్ ఫ్యూచర్స్ 0.54 శాతం మేర తగ్గింది. వరుసగా రెండో రోజు ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్‌లో వెండి ధర కిలో 0.26 శాతం తగ్గి రూ.43,026 పలికింది. ఈ నెల మొదటి వారంలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ.45,724 రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.

ఇందుకే బంగారానికి మద్దతు

ఇందుకే బంగారానికి మద్దతు

కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు దేశవ్యాప్త లాక్ డొన్ కొనసాగుతోంది. దీంతో గోల్డ్ స్పాట్ మార్కెట్లు మూతబడ్డాయి. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు చర్యలు తీసుకుంటాయని, ఆర్థిక మద్దతు ఉంటుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు.

బంగారం ఎంత తగ్గిందంటే..

బంగారం ఎంత తగ్గిందంటే..

మధ్యాహ్నం సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 0.11 శాతం లేదా రూ.51 తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.39 శాతం లేదా రూ.170 తగ్గింది. దీంతో బంగారం 10 గ్రాములు రూ.44,890, వెండి కిలో రూ.42,969 పలికింది.

గోల్డ్ ఫ్యూచర్స్ రూ.4,000 పెరిగింది

గోల్డ్ ఫ్యూచర్స్ రూ.4,000 పెరిగింది

ఇరవై రోజుల్లో స్పాట్ బంగారం ధర అంతగా పెరగలేదు. కానీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర మాత్రం పెరిగింది. ఉదాహరణకు అహ్మదాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం మార్చి 17న రూ.39,741గా ఉంది. ఆ తర్వాత పెరుగుతూ తగ్గుతూ ఇప్పుడు రూ.40,989 వద్ద ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ 17 మార్చిన రూ.40,670 ఉండగా, ఇప్పుడు రూ.44,980 పలుకుతోంది. అంటే రూ.4 వేలకు పైగా గోల్డ్ ఫ్యూచర్స్ పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పడిపోవడం బంగారం ధరకు మద్దతు పలికింది. వైరల్ కరెన్సీతో పోలిస్తే డాలర్ 0.3 శాతం తగ్గింది. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నేడు 0.1 శాతం పెరిగి ఔన్స్‌కు 1,646.81 డాలర్ల వద్ద ఉంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ధర 0.1 శాతం పెరిగి 15.03 డాలర్లు, ప్లాటినమ్ 0.5 శాతం పెరిగి 733.30 డాలర్లుగా ఉంది.

English summary

వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు, ఫ్యూచర్ గోల్డ్ మాత్రం షాక్ | Gold prices today fall for second day in April 2020

Gold prices in India fell for the second day in a row, tracking muted global rates. On MCX, June gold futures fell 0.14% to 44,880 per 10 gram, extending decline to the second day.
Story first published: Thursday, April 9, 2020, 12:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X