For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2,400 తగ్గినా బంగారం కొనుగోలుకు ఆసక్తి లేదు.. ఎందుకంటే?

|

న్యూఢిల్లీ: బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు వివిధ కారణాలతో గత నాలుగు రోజులుగా ధరలు తగ్గాయి. ఎంసీఎక్స్ ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.30 శాతం తగ్గి రూ.37,597గా ఉంది. వెండి ధర కూడా తగ్గింది. ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.20 శాతం తగ్గి రూ.43,465గా ఉంది. సెప్టెంబర్ నెలలో బంగారం రూ.40,000 మార్క్ దాటింది. ఆ రికార్డ్ గరిష్ట ధరతో పోలిస్తే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 తగ్గింది.

ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఉచిత కాల్స్: జియో ధరలే తక్కువఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఉచిత కాల్స్: జియో ధరలే తక్కువ

ధరలు తగ్గిన బంగారానికి డిమాండ్ లేదు!

ధరలు తగ్గిన బంగారానికి డిమాండ్ లేదు!

ధరలు తగ్గినప్పటికీ భారత్‌లో ఫిజికల్ బంగారానికి డిమాండ్ అంతగా పెరగలేదట. ప్రస్తుతం పెద్దగా పెళ్లిళ్లు లేవు. ఎలాంటి పండుగ సీజన్ లేదు. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కొనుగోళ్లు అంతగా పెరగలేదని చెబుతున్నారు. గత వారం కూడా ధరలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ డిమాండ్ మితంగానే ఉందని చెబుతున్నారు.

రూపాయి ప్రభావం

రూపాయి ప్రభావం

అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువపై కూడా బంగారం ధరలు ఆధారపడి ఉంటాయి. అంతకుముందు రోజు డాలర్‌తో రూపాయి వ్యాల్యూ 71.20గా ఉండగా, సోమవారం 71.15గా ఉంది. రూపాయి కాస్త బలపడటం కూడా ప్రభావం చూపుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

ఇక, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఔన్స్‌కు 0.1 శాతం పెరిగి 1,460.40 డాలర్లుగా ఉంది. అంతకుముందు సెషన్‌లో 1 శాతం తగ్గింది. నెలలో ఓ రోజులో అత్యధికంగా బంగారం ధర పడిపోవడం ఇదే. ఔన్స్ వెండి ధర 0.1 శాతం పెరిగి 16.58 డాలర్లుగా ఉంది.

English summary

రూ.2,400 తగ్గినా బంగారం కొనుగోలుకు ఆసక్తి లేదు.. ఎందుకంటే? | Gold prices today fall for fourth day in a row, silver rates decline

India Gold February futures were rangebound and continued its decline on December 9, as news around the US China trade deal remained mixed.
Story first published: Monday, December 9, 2019, 14:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X