For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.47,000 స్థాయికి.. అదిరిపోయే న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు

|

ముంబై: బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9,000 వరకు తక్కువగా ఉంది. బడ్జెట్‌కు ముందునుండే ధరలు తగ్గుతున్నాయి. బడ్జెట్ తర్వాత మరింతగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు భారీగానే క్షీణించాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పసిడి కేవలం రెండు రోజుల్లోనే రూ.2,000 వరకు పడిపోయింది. వెండి ధరలు కూడా రూ.67,000 దిగువన ఉన్నాయి. కరోనా సమయంలో బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 (అంతర్జాతీయ మార్కెట్లో 2,072 డాలర్లు)కు చేరుకుంది. అయితే ఆ తర్వాత ఇటీవల రూ.50,000 మధ్య కదలాడుతున్నప్పటికీ, ప్రస్తుతం స్మాల్ కరక్షన్‌లో భాగంగా ధరలు తగ్గుతున్నాయని అంటున్నారు.

47,000 స్థాయికి పసిడి

47,000 స్థాయికి పసిడి

ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేడు (గురువారం, ఫిబ్రవరి 4వ తేదీ) 593.00 (-1.24%) తగ్గి రూ.47,157.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,400.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,400.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,157.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9000కు పైగా తక్కువ ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 997.00 (-2.09%) క్షీణించి రూ.46,819.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,486.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.47,673.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,806.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.1800 డౌన్

వెండి రూ.1800 డౌన్

వెండి ధర కూడా భారీగానే తగ్గింది. ఏకంగా రూ.1828 క్షీణించింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో 1,828.00 (-2.67%) క్షీణించి రూ.66737.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,783.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.68,184.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,601.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.1,857.00 (-2.67%) తగ్గి రూ.67765.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,958.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,200.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,724.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువకు పసిడి

1800 డాలర్ల దిగువకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గి, 1800 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ఏకంగా 45 డాలర్లకు పైగా తగ్గింది. 45.10(-2.46%) డాలర్లు తగ్గి 1790 వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,792.90 - 1,835.70 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 16.17% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర 0.682

(-2.54%) డాలర్లు తగ్గి 26.207 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 26.067 - 26.997 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 51.53శాతం పెరిగింది.

English summary

రూ.47,000 స్థాయికి.. అదిరిపోయే న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు | Gold prices today fall for 4th day in a row, down ₹9,000 from record highs

Gold and silver prices today edged lower in Indian markets today amid a slide in rates of precious metals in global markets. On MCX, gold futures skidded 1% to ₹47,310 per 10 gram, extending losses to the fourth day. In four days, gold has lost nearly ₹2000 per 10 gram amid a slide in global rates and import duty cut announced in Budget 2021. Silver futures on MCX today declined 1% to ₹67,848 per kg.
Story first published: Thursday, February 4, 2021, 20:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X