ముంబై: బంగారం ధరలు ఎనిమిది నెలల కనిష్టానికి తగ్గాయి. ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా ఐదు రోజులుగా తగ్గుతున్నాయి. దీంతో ఎనిమిది నెలల కనిష్టానికి చేరుకుంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధర 10 గ్రాములు నిన్ననే రూ.47,000 దిగువకు వచ్చింది. ఈ రోజు (ఫిబ్రవరి 17, బుధవారం) ప్రారంభ సెషన్లో మరింత క్షీణించింది. వెండి మాత్రం స్వల్పంగా పెరిగింది. అయినప్పటికీ రూ.70,000 దిగువనే ఉంది.ఎంసీఎక్స్‌లో నిన్న ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.380 తగ్గి రూ.46,861 వద్ద, జూన్ ఫ్యూచర్స్ రూ.327 క్షీణించి రూ.47,055 వద్ద ముగిసింది. వెండి ధర కూడా రూ.800కు పైగా తగ్గి రూ.70,000 దిగువన ముగిసింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.811 క్షీణించి రూ.69,318 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.807 క్షీణించి రూ.70424 వద్ద క్లోజ్ అయింది.

స్వల్పంగా తగ్గిన బంగారం
ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు ఉదయం స్వల్పంగా తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.119.00 (0.25%) తగ్గి రూ.46,780.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,800.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,800.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,728.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9500 వరకు తక్కువ ఉంది. అంటే దాదాపు రూ.10వేలు తక్కువ ఉంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.161.00 (0.34%) తగ్గి రూ.46,900 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,900.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,900.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,900.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.70వేల దిగువకు
వెండి ధరలు మాత్రం ఈ రోజు పెరిగాయి. అయితే రూ.70,000 దిగువనే ఉంది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.101.00(0.15%) పెరిగి రూ.69,473.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,507.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,626.00 వద్ద గరిష్టాన్ని, రూ.69,400.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా కిలో రూ.43.00 (0.06%) పెరిగి రూ.70,528.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,657.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.70,700.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,528.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువకు పసిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువకు వచ్చింది. నేడు గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.40
(0.36%) డాలర్లు తగ్గి 1792.60 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,785.80 - 1,794.20 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 12.51 శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. ఔన్స్ ధర 0.082
(0.30%) డాలర్లు పెరిగి 27.407 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.120 - 27.477 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 53.24 శాతం పెరిగింది.
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications