For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices today: భారీగా పెరిగి, స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

|

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు అతి స్వల్పంగా తగ్గాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి రూ.114 తగ్గింది. నిన్న దాదాపు రూ.46,000కు సమీపంలో పసిడి క్లోజ్ అయింది. గత కొద్ది వారాలుగా రూ.45వేల దిగువన ఉన్న పసిడి, ఇటీవలే ఈ మార్కును క్రాస్ చేసింది. నిన్న ఏకంగా రూ.46వేల దగ్గరకు చేరుకుంది. అయితే నేడు స్వల్పంగా తగ్గింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.10,400 తక్కువగా ఉంది. క్రితం నెలలో ఓ సమయంలో రూ.12,400 కూడా తక్కువ పలికింది. ఈ కాలంలోనే పసిడి దాదాపు రూ.2000 పెరిగింది.

బంగారం స్వల్పంగా తగ్గుదల

బంగారం స్వల్పంగా తగ్గుదల

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.114.00 (0.25%) తగ్గి రూ.45,805.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.45,766.00 ప్రారంభమైన ధర, రూ.45,911.00 గరిష్టాన్ని, రూ.45,742.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.78.00 (0.17%) పెరిగి రూ.46070.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,057.00 ప్రారంభమైన ధర, రూ.46,070.00 గరిష్టాన్ని, రూ.45,057.00 కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.65వేలకుపైన

వెండి రూ.65వేలకుపైన

నిన్న భారీగా పెరిగిన వెండి ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.174.00 (0.26%) తగ్గి రూ.65723.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.65,690.00 వద్ద ప్రారంభమై, రూ.65,750.00 గరిష్టాన్ని, రూ.65,679.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.6.00 (0.01%) తగ్గి రూ.66826.00 వద్ద ట్రేడ్ అయింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు తగ్గాయి. 3.55 (-0.20%) డాలర్లు తగ్గి 1,739.45 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,736.70 - 1,745.35 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. ఓ సమయంలో 25 డాలర్లను క్రాస్ చేసింది. 0.070 (0.28%) డాలర్లు తగ్గి 25.157 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.082 - 25.220 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold prices today: భారీగా పెరిగి, స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు | Gold prices today fall, a day after seeing big jump, silver rates drop

Gold and silver prices edged lower in Indian markets, a day after clocking sharp gains. On MCX, gold futures were down 0.33% to ₹45,767 per 10 gram while silver declined 0.28% to ₹65,715 per kg. In the previous session, gold had jumped ₹600 or 1.25% per 10 gram while silver had surged 2% or ₹1,300 per kg. In global markets, gold today edged lower after hitting a two-weak high in the previous session.
Story first published: Wednesday, April 7, 2021, 10:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X