For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ పెరిగి, ఇక్కడ తగ్గి.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే! మరింత పెరగొచ్చు...

|

బంగారం ధరలు ఈ రోజు (జూలై 14, మంగళవారం) స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లోను తగ్గుముఖం పట్టాయి. ఈరోజు ఉదయం ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.5 శాతం తగ్గి రూ.48,912 పలికింది. అంతకుముందు సెషన్‌లో ఏకంగా 0.55 శాతం పెరిగింది. వెంి కూడా 1.2 శాతం తగ్గి కిలో రూ.52,408 పలికింది. అంతకుముందు సెషన్‌లో 3.3 శాతం తగ్గింది. కరోనా, గ్లోబల్ టెన్షన్స్ వంటి వివిధ కారణాలతో బంగారం ధరలు గత వారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాములు రూ.49,348 గరిష్టానికి చేరుకుంది.

1.10లక్షల హెక్టార్ల భూమి రెడీ: విశాఖ పోర్ట్ సహా.. ఉద్యోగాలు, ఉపాధి కోసం కేంద్రం కీలక నిర్ణయం!1.10లక్షల హెక్టార్ల భూమి రెడీ: విశాఖ పోర్ట్ సహా.. ఉద్యోగాలు, ఉపాధి కోసం కేంద్రం కీలక నిర్ణయం!

బంగారం ధర పెరిగింది

బంగారం ధర పెరిగింది

ఎంసీఎక్స్‌లో తగ్గినప్పటికీ బయట బులియన్ మార్కెట్లో పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ.120 వరకు పెరిగి 10 గ్రాములు రూ.49,960 పలికింది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 24 క్యారెట్ల బంగారం స్వల్పంగా పెరిగి రూ.51,240 పలికింది. 22 క్యారెట్ల బంగారం రూ.46,960కి చేరుకుంది. కిలో వెండి రూ.52,210కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు ఔన్స్ 0.2 శాతం పడిపోయి 1,798.52 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.7 శాతం తగ్గి 1,802.20 డాలర్లు పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ స్వల్పంగా పెరిగి 833.14 డాలర్ల వద్ద ఉంది. వెండి ధర 0.1 శాతం తగ్గి 19.07 డాలర్లుగా ఉంది. ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ మారకం 0.1 శాతం పెరిగింది. మిగతా కరెన్సీలతో డాలర్ బలపడితే ఆయా కరెన్సీలలో బంగారం ధర పెరుగుతుంది. అంతర్జాతీయ గోల్డ్ ట్రస్ట్ ఎస్పీడీఆర్ వద్ద బంగారం నిల్వలు 0.3 శాతం పెరిగి 1,203.97 టన్నులకు చేరుకుంది.

మరింతగా పెరగవచ్చు

మరింతగా పెరగవచ్చు

ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలహీనత, పెరుగుతున్న కరోనా కేసులు బంగారంపై ఒత్తిడిని పెంచుతాయని, సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి, వెండి వైపు చూస్తారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రానున్న మరికొద్ది రోజులు కూడా బంగారానికి డిమాండ్ ఉంటుందని, ఎంసీఎక్స్‌లో రూ.49,330 నుండి రూ.49,550 లెవల్‌లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

English summary

అక్కడ పెరిగి, ఇక్కడ తగ్గి.. బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే! మరింత పెరగొచ్చు... | Gold prices skid below Rs 49,000 after edging closer to record highs

Gold prices in India fell today, tracking a decline in global markets and profit-taking at higher levels. On MCX, gold futures were down 0.5% to ₹48,912 per 10 gram, after rising 0.55% in the previous session.
Story first published: Tuesday, July 14, 2020, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X