For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

48 వేలు దాటిన బంగారం- వెండి ధరల్లో పెరుగుదల- అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో

|

అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న పాజిటివ్ ట్రెండ్ కారణంగా భారత్‌లో బంగారం ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వెండి కూడా పుంజుకుంది. అయితే బంగారం ధరల్లో పెరుగుదల పరిమితంగానే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొంతకాలం బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చని తెలుస్తోంది. బంగారం ఏప్రిల్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్లో 10 గ్రాములు రూ.48 వేలు దాటింది. వెండి మార్చి ఫ్యూచర్స్ మార్కెట్లో 2 శాతం పెరిగి రూ.68770గా నమోదైంది. నిన్న డాలర్‌ ఇండెక్స్‌లో పెరుగుదల, ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడంతో తగ్గిన ధరలు ఇవాళ కాస్త పెరుగుదల నమోదు చేసుకున్నాయి.

రిటైల్ ఇన్వెస్టర్ల ప్రభావం, రెడ్డిట్‌ సంకేతాలతో అంతర్జాతీయంగా వెండి ధరలు పెరిగాయి, వెండిలో రిటైల్ పెట్టుబడి ట్రెండ్ కొనసాగడంతో అమెరికా నుంచి సింగపూర్ వరకు బంగారం కడ్డీలు, నాణేలకు డిమాండ్‌ పెరుగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్)లో బంగారు ఫ్యూచర్స్ 0.31 శాతం మేర పెరిగి రూ .150 నమోదు చేసింది. దీంతో 10 గ్రాముల బంగారం రూ .47,975 వద్ద ట్రెండ్‌ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 1.61 శాతం లేదా రూ .1,090 పెరిగి 72,046 రూపాయలకు చేరుకుంది.

gold prices rise above rs.48,000, silver also raise with international trends

స్పాట్ మార్కెట్లో లోహ ధరల తగ్గుదలతో దేశ రాజధానిలో బంగారం మంగళవారం 10 గ్రాములకు 480 రూపాయలు తగ్గి 47,702 రూపాయలకు చేరుకుంది. వెండి కూడా కిలోకు రూ .3,097 నుంచి రూ .70,122 కు పడిపోయింది. గత వారంలో ప్రారంభమైన సోషల్ మీడియా ర్యాలీ చల్లబడినట్లు కనిపిస్తున్నప్పటికీ, మునుపటి సెషన్లో 8 శాతానికి పైగా పడిపోవటం కొంత కొనుగోలుకు ప్రేరేపించడంతో ఇవాళ వెండి ధరలు పుంజుకోవడానికి ప్రయత్నించాయి.

స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 1.4 శాతం పెరిగి 26.98 డాలర్లకు చేరుకుంది. ఇది సోమవారం 30.03 డాలర్లను తాకింది, 2013 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అత్యధికం. ప్లాటినం 0.3 శాతం పెరిగి 1,097.52 డాలర్లు, పల్లాడియం 0.1 శాతం తగ్గి 2,240.49 డాలర్లకు చేరుకుంది.

English summary

48 వేలు దాటిన బంగారం- వెండి ధరల్లో పెరుగుదల- అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో | gold prices rise above rs.48,000, silver also raise with international trends

Gold futures prices rose while silver also rebounded tracking the trend in the international market. However, gains in gold were limited and analysts expect sideways movement for now.
Story first published: Wednesday, February 3, 2021, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X