For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, హైదరాబాద్‌లో తగ్గుదల

|

బంగారం ధరలు ఈ రోజు (ఏప్రిల్ 29) కాస్త స్థిరంగానే ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.46,100 (0.06 శాతం పెరిగి) వద్ద ఫ్లాట్‌గా ఉంది. అంతకుముందు సెషన్‌లలో ధర తగ్గిన విషయం తెలిసిందే. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ 0.25 శాతం పడిపోయింది. నిన్న సిల్వర్ మే ఫ్యూచర్ 0.57 శాతం పెరిగి కిలో రూ.41,951కి చేరుకుంది. ఈ రోజు ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.

షాకింగ్: మాల్యా-చోక్సీ సహా 50 మంది టాప్ డిఫాల్టర్ల రూ.68,600 కోట్ల రుణాలు రద్దు!షాకింగ్: మాల్యా-చోక్సీ సహా 50 మంది టాప్ డిఫాల్టర్ల రూ.68,600 కోట్ల రుణాలు రద్దు!

అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు ఫ్లాట్‌గానే ఉన్నాయి. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 1,720 డాలర్లకు కిందకు పడిపోయింది. వెండి ఫ్యూచర్ కాంట్రాక్ట్ 15 డాలర్లుగా ఉంది. స్పాట్ గోల్డ్ 0.1 శాతం పెరిగి 1,708.53 డాలర్లు పలికింది. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఈ వారం రూ.45,700-46,330 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి కిలో రూ.41,300-42,100 మధ్య ఉండవచ్చు.

Gold prices remain weak for third day in a row

కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అంతర్జాతీయంగా కూడా వ్యాపారాలు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు నష్టపోతుండటం, చమురు ధరలు పడిపోతుండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో పసిడిపై పెట్టుబడి మంచిదిగా భావిస్తున్నారు.

బంగారం ధర బుధవారం హైదరాబాద్ మార్కెట్లో తగ్గింది. 22 గ్రాముల 10 క్యారెట్ల పసిడి రూ.500 తగ్గి రూ.44,240, 24 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి 47,000కు చేరుకుంది. వెండి ధర కిలో రూ.700 దిగి వచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుండి డిమాండ్ మందగించింది.

English summary

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, హైదరాబాద్‌లో తగ్గుదల | Gold prices remain weak for third day in a row

Gold prices in India remained weak for third day in a row as the yellow metal saw some profit-taking at higher levels. On MCX, June gold futures were flat at ₹46,100 after seeing moderate declines in past two sessions. Gold futures had fallen 0.25% in the previous session. Silver however saw some momentum with May futures on MCX rising 0.57% to ₹41,951 per kg.
Story first published: Wednesday, April 29, 2020, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X