For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2 రోజుల్లో రూ.1,400 జంప్, భారీగా పెరిగిన బంగారం: రూ.3వేలు పెరిగిన వెండి

|

నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు శుక్రవారం (నవంబర్ 6) ప్రారంభ సెషన్‌లో స్వల్పంగా తగ్గినట్లు కనిపించినప్పటికీ, సాయంత్రానికి తిరిగి పుంజుకున్నాయి. నిన్న డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1,257.00 పెరిగి రూ.52,077.00, ఫిబ్రవరి ఫ్యూచర్స్ దాదాపు అంతే పెరిగి రూ.52,200.00 పలికింది. వెండి ఫ్యూచర్స్ రూ.3వేల వరకు పెరిగింది. ఈ రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. దీంతో వరుసగా రెండో రోజు రూ.52వేలను దాటింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.4,000 తక్కువగా ఉంది. బంగారం ధర రెండు రోజుల్లో రూ.1400కు పైగా పెరిగింది.

భారీగా షాకిచ్చిన బంగారం, నేడు కాస్త ఊరట: వెండి పైపైకి.. రూ.65,000 సమీపానికి...భారీగా షాకిచ్చిన బంగారం, నేడు కాస్త ఊరట: వెండి పైపైకి.. రూ.65,000 సమీపానికి...

రూ.400 వరకు కూడా జంప్ చేసి...

రూ.400 వరకు కూడా జంప్ చేసి...

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) సాయంత్రం గం.9.45 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.110.00 (0.21%) పెరిగి రూ.52,165.00 పలికింది. రూ.51,912 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,711 వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో రూ.52,450ని తాకింది. అంటే నేడు రూ.400కు పైగా కూడా పెరుగుదల చూసింది.

ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.95.00 (0.18%) పెరిగి రూ.52,289.00 వద్ద పలికింది. రూ.52,066.00 ప్రారంభం కాగా, రూ.51,895.00 వద్ద కనిష్టాన్ని, రూ.52,615.00 వద్ద గరిష్టాన్ని తాకింది.

రూ.2వేలకు పైగా పెరిగి...

రూ.2వేలకు పైగా పెరిగి...

వెండి ధర ఈ రోజు రూ.1000 వరకు పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.916.00 (1.43%) పెరిగి రూ.65169.00 ట్రేడ్ అయింది. రూ.64,479.00 వద్ద ప్రారంభమై, రూ.66,244.00 గరిష్టాన్ని తాకి, రూ.64,024.00 కనిష్టాన్ని తాకింది. నేడు ఓ సమయంలో రూ.2,000కు పైగా కూడా పెరిగింది. సాయంత్రానికి రూ.900కు పైగా పెరుగుదలతో ఉంది. నిన్న రూ.2వేలకు పైగా పెరిగింది. ఈ రెండు రోజుల్లో రూ.3వేల వరకు పెరిగింది.

మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.852.00 (1.29%) పెరిగి రూ.66807.00 పలికింది. రూ.66,135.00 ప్రారంభమై, రూ.67,978.00 గరిష్టాన్ని, రూ.65,839.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను...

అంతర్జాతీయ మార్కెట్లోను...

అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. ఔన్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.30 శాతం పెరిగి 1,952.70 డాలర్లను తాకింది. 1,937.25 - 1,961.75 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 1,946.80 వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది 27.33 శాతం పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ 1.50 శాతం పెరిగి ఔన్స్ 25.578 డాలర్లు పలికింది. 25.015 - 25.970 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో 25.191 డాలర్ల వద్ద ముగిసింది. నేడు 26 డాలర్ల సమీపానికి చేరుకుంది. ఈ ఏడాది వెండి 39.94% మేర పెరిగింది.

English summary

2 రోజుల్లో రూ.1,400 జంప్, భారీగా పెరిగిన బంగారం: రూ.3వేలు పెరిగిన వెండి | Gold prices in India jump Rs 1,400 per in just two days, silver surges

Gold prices were firm today in Indian markets today tracking a global rally this week. In India, gold futures traded 0.6% higher at ₹52,377 per 10 gram on MCX while silver futures were 2.6% higher at ₹65,965.
Story first published: Friday, November 6, 2020, 23:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X