For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.50,000కు సమీపంలో... భారీగా పెరిగిన బంగారం ధరలు: ఏడేళ్ల గరిష్టానికి

|

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం (మే 18) ఎంసీఎక్స్‌లో జూన్ గోల్డ్ కాంట్రాక్ట్స్ ఉదయం గం.9.20 సమయానికి 10 గ్రాములకు 0.73 శాతం పెరిగి రూ.47,725 పలికింది. వెండి కిలో 3 శాతం ఎగిసి రూ.48,138 పలికింది. గత వారం రోజుల్లో ఎంసీఎక్స్‌లో బంగారం ధర 3.40 శాతం, వెండి దాదాపు 8 శాతం పెరిగింది.

భారీగా పెరుగుతున్న బంగారం ధర: ఆ తర్వాత ధర ఆగిపోతుందా! 'ఒత్తిళ్లు' సహా కారణాలివే?భారీగా పెరుగుతున్న బంగారం ధర: ఆ తర్వాత ధర ఆగిపోతుందా! 'ఒత్తిళ్లు' సహా కారణాలివే?

రూ.50,000 సమీపంలో బంగారం ధర

రూ.50,000 సమీపంలో బంగారం ధర

హైదరాబాద్ మార్కెట్లో సోమవారం ధరలు 22 క్యారెట్ల బంగారం రూ.45,480కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 48,550కి చేరుకుంది. అంటే బంగారం ధరలు హైదరాబాదులో రూ.50,000 మార్క్‌కు సమీపంలో ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,510 పలికింది.

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది?

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా మధ్య ఘర్షణ వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటం, అమెరికా, జపాన్ దేశాల బలహీన ఎకనమిక్ డేటా తదితరాలు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు చూసేందుకు కారణం అవుతోంది. అమెరికా సహా వివిధ దేశాల్లో నిరుద్యోగుల సంఖ్య రికార్డ్ స్థాయికి చేరుకుంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే.

గోల్డ్ ఫ్యూచర్స్ పెరుగుతోంది

గోల్డ్ ఫ్యూచర్స్ పెరుగుతోంది

గత నెల రోజుల్లో బంగారం ఫ్యూచర్స్ ధరలు దాదాపు రూ.2 వేలు పెరుగుదల చూశాయి. గత నెల 21వ తేదీన గోల్డ్ ఫ్యూచర్స్ రూ.45,992 పలికింది. ఈ నెల 1వ తేదీ నాటికి అది రూ.45,556కు తగ్గింది. 13వ తేదీ వరకు రూ.46 వేల లోపు పలికింది. ఆ తర్వాత నుండి క్రమంగా పెరిగి ఇప్పుడు రూ.47వేలు దాటింది. గత ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి.

అంతర్జాతీయ మార్కెట్లో.. ఏడేళ్ల గరిష్టానికి

అంతర్జాతీయ మార్కెట్లో.. ఏడేళ్ల గరిష్టానికి

అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర పెరిగింది. స్పాట్ గోల్డ్ 0.9 శాతం పెరిగి ఔన్స్ ధర 1,756.79 పలికింది. అక్టోబర్ 12, 2012 (1,759.98) తర్వాత ఇదే రికార్డ్ ధర. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం లాభపడి 1,765.70 పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం ఔన్స్ 0.5 శాతం తగ్గి 1,892.25 డాలర్లు, ప్లాటినమ్ 0.7 శాతం ఎగిసి 803.19 డాలర్లు, వెండి 2 శాతం ఎగిసి 16.96 డాలర్లు పలికింది.

English summary

రూ.50,000కు సమీపంలో... భారీగా పెరిగిన బంగారం ధరలు: ఏడేళ్ల గరిష్టానికి | Gold prices hit record high, over Rs 47,700

Gold prices in India on Monday continued to gain for the second day in a row tracking firm global rates as worries over the friction between the US and China and bleak US economic data underpinned the safe haven metal.
Story first published: Monday, May 18, 2020, 13:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X