For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం భారీ పతనం, రూ.600 తగ్గుదల: వెండి రూ.2000కు పైగా డౌన్

|

బంగారం ధరలు భారీగా తగ్గాయి. రూ.48,600 దిగువకు వచ్చాయి. వెండి ధరలు అయితే ఏకంగా రూ.2000కు పైగా తగ్గాయి. నేడు ఉదయం భారీగా పెరిగిన బంగారం రూ.50,000 దిశగా వెళ్తున్నట్లుగా కనిపించింది. రూ.49,670 వద్ద నేటి గరిష్టాన్ని తాకింది. ఉదయం రూ.500కు పైగా పెరిగిన గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రానికి రూ.600 వరకు క్షీణించింది. మొత్తంగా నేడు రూ.1100 మేర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి 40 డాలర్ల వరకు తగ్గి 1875 డాలర్ల దిగువకు పడిపోయింది. వెండి 28 డాలర్ల దిగువన ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7600 తక్కువగా ఉంది. ఉదయం ఆల్ టైమ్ గరిష్టంతో రూ.6500 మాత్రమే తక్కువగా ఉంది. ఉదయానికి సాయంత్రానికి రూ.1000కి పైగా మార్పు వచ్చింది.

భారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.584.00 (1.19%) తగ్గి రూ.48570.00 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం రూ.49,670 వద్ద కదలాడింది. అంటే ఉదయంతో రూ.1100 తక్కువగా ఉంది. రూ.49,163.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,670.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,570.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.946.00 (-1.91%) తగ్గి రూ.48655.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,612.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,644.00 గరిష్టాన్ని, రూ.48,530.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.2000కు పైగా తగ్గిన వెండి

రూ.2000కు పైగా తగ్గిన వెండి

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2వేలకు పైగా తగ్గింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.2,091.00 (2.88%) తగ్గి రూ.70587.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,835.00 వద్ద ప్రారంభమై, రూ.72,849.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.69,800.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,108.00 (-2.86%) తగ్గి రూ.71708.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,941.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,960.00 గరిష్టాన్ని, రూ.71,051.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 1875 డాలర్ల దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 38.50 (2.02%) డాలర్లు తగ్గి 1,871.40 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,866.85 - 1,912.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.826 (2.93%) డాలర్లు తగ్గి 27.378 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.098 - 28.360 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

బంగారం భారీ పతనం, రూ.600 తగ్గుదల: వెండి రూ.2000కు పైగా డౌన్ | Gold prices fall for second day below Rs 49,000 on stronger rupee, ETF outflow

Technically, International Gold is trading with bearish momentum near $1,900 levels and may continue to decline and test the support of $1,892-$1,885 levels.
Story first published: Thursday, June 3, 2021, 22:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X