For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, నేటి సాయంత్రం ఎలా ఉన్నాయంటే

|

ముంబై: బంగారం ధరలు నేటి (సోమవారం, జనవరి 11) సాయంత్రం సెషన్ సమయానికి పెరిగాయి. రూ.50వేల పైకి చేరుకొని, రూ.52వేల దిశగా సాగిన పసిడి గతవారం చివరలో రూ.49,000 దిగువకు పడిపోయింది. నేడు మళ్లీ రూ.49,000 పైకి చేరుకుంది. గత ఏడాది ఆగస్ట్ 7 నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.7,000 కంటే తక్కువగా ఉంది. కరోనా కేసులు, వ్యాక్సీన్, అమెరికా ఆర్థిక ప్యాకేజీ వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి.

బంగారంపై 'బిట్ కాయిన్' ఒత్తిడి, పసిడి మరింత తగ్గుతుందా?బంగారంపై 'బిట్ కాయిన్' ఒత్తిడి, పసిడి మరింత తగ్గుతుందా?

రూ.49,000 పైకి బంగారం

రూ.49,000 పైకి బంగారం

నేడు ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 299.00 (0.61%) పెరిగి రూ49266.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,786.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,390.00 వద్ద గరిష్టాన్ని, రూ.48635.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 వరకు తక్కువగా ఉంది.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.307.00 (0.63%) పెరిగి రూ.49319.00 వద్ద ప్రారంభమైంది. రూ.48,711.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,426.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,682.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర రూ.1000 జంప్

వెండి ధర రూ.1000 జంప్

సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1100కు పైగా పెరిగింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 1,104.00 (1.72%) క్షీణించి రూ.65335.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,603.00 వద్ద ప్రారంభమై, రూ.65,590.00 వద్ద గరిష్టాన్ని, రూ.63,603.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1045.00 (1.60%) పెరిగి రూ.66247.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.64,915.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.66,432.00 వద్ద గరిష్టాన్ని, రూ.64,890.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1850 డాలర్ల దిగువనే పసిడి

1850 డాలర్ల దిగువనే పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర 1850 డాలర్లకు దిగువనే కొనసాగుతోంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 11.35 (+0.62%) డాలర్లు పెరిగి 1,846.75 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,817.35 - 1,855.70 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 14.64% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. ఔన్స్ ధర +0.561 (+2.28%) డాలర్లు పెరిగి 25.198 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 24.400 - 25.590 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 34.6 శాతం పెరిగింది.

English summary

మళ్లీ పెరిగిన బంగారం ధరలు, నేటి సాయంత్రం ఎలా ఉన్నాయంటే | Gold prices down Rs 7,000 from record highs

After posting gains of over 25% in 2020, gold prices have suffered wild swings from the start of this year. After hitting a high of ₹51,800 per 10 gram last Tuesday, gold futures on MCX fell to ₹48,635 at day's low today.
Story first published: Monday, January 11, 2021, 22:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X