For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గరిష్టస్థాయి నుండి రూ.4,000 తగ్గిన బంగారం ధర

|

బంగారం ధరలు గతవారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో భారీగా తగ్గాయి. శుక్రవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.760 క్షీణించి(1.5 శాతం) రూ.52,170 పలికింది. వారంలో ఒకటిరెండుసార్లు పెరిగినప్పటికీ తగ్గుదల ఎక్కువగా ఉంది. ఈ వారంలో పసిడి ధర రూ.2,600 తగ్గింది. అయితే ఆగస్ట్ 7వ తేదీన రికార్డ్ ధర నుండి రూ.56,200తో పోలిస్తే రూ.4,000 తగ్గింది. కిలో వెండి శుక్రవారం 5.5 శాతం తగ్గి (రూ.4,400) రూ.67,220 పలికింది.

<strong>మరికొద్దిరోజులు ఆ ధర వద్దే బంగారం, కారణమిదే</strong>మరికొద్దిరోజులు ఆ ధర వద్దే బంగారం, కారణమిదే

అంతర్జాతీయ మార్కెట్లో వారంలో 4 శాతానికి పైగా పడిపోయి ఔన్స్ 1950 డాలర్ల సమీపంలో ఉంది. రష్యా వ్యాక్సీన్ రాక నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ధరలు తగ్గాయి. న్యూయార్క్‌లో స్పాట్ గోల్డ్ 0.4 శాతం 1945 డాలర్లు పలికింది. వారంలో ధరలు 4.5 శాతం పడిపోవడం గమనార్హం. జూన్ నుండి ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. తాజా తగ్గుదలతో ఈ ఏడాది బంగారం ధరలు 28 శాతం పెరిగాయి.

 Gold prices down ₹4,000 from last weeks highs

ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, ప్రపంచ దిగ్గజ ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకుంటున్న సూచనలు, అమెరికా డాలర్ కోలుకోవడం, రష్యా వ్యాక్సీన్, ఈక్విటీ మార్కెట్లు రోజురోజూ లాభాల్లోకి రావడం వంటి వివిధ కారణాలు పసిడి ధరలపై ప్రభావం చూపాయి. పసిడి ధరలు మరికొంతకాలం 2000 డాలర్ల వద్ద మరికొంత కాలం తచ్చాడవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

English summary

గరిష్టస్థాయి నుండి రూ.4,000 తగ్గిన బంగారం ధర | Gold prices down ₹4,000 from last week's highs

Gold prices fell sharply in India this week, tracking a decline in global markets. On Friday, October gold futures fell ₹760 or ₹1.5% to ₹52,170 per 10 gram. For the week, gold was down about ₹2,600 per 10 gram. But from August 7th highs of about ₹56,200, gold is down about ₹4,000 per 10 gram. Silver also fell sharply on Friday, slumping 5.5% or ₹4,000 to ₹67,220 per kg.
Story first published: Sunday, August 16, 2020, 21:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X