For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం భారీ షాక్, రూ.50,000 దిశగా పరుగులు: నేడు రూ.500కు పైగా జంప్

|

బంగారం ధరలు నేడు (జూన్ 3, గురువారం) భారీగా పెరగగా, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. రూపాయి క్షీణించడం, కరోనా లాక్ డౌన్ కొనసాగడం వంటి వివిధ కారణాలతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై ఒత్తిడి పెరిగింది. గతవారం దాదాపు స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ వారం మళ్లీ పెరిగాయి. నేడు బంగారం ధరలు ఏకంగా రూ.500కు పైగా పెరిగాయి. మళ్లీ రూ.50వేల దిశగా పరుగు పెడుతోంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.6500 మాత్రమే తక్కువగా ఉంది. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. నేడు 1900 డాలర్ల దిగువకు వచ్చాయి.

బంగారాన్ని తీసుకోవడం లేదు, బ్యాంకులకు మరింత భారమే: వారు వేలం వేస్తున్నారు..బంగారాన్ని తీసుకోవడం లేదు, బ్యాంకులకు మరింత భారమే: వారు వేలం వేస్తున్నారు..

భారీగా పెరిగిన బంగారం ధర

భారీగా పెరిగిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.516.00 (1.05%) పెరిగి రూ.49670.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,163.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,670.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.48,996.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.199.00 (-0.40%) తగ్గి రూ.49402.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,612.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,644.00 గరిష్టాన్ని, రూ.49,362.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.72వేలకు పైనే వెండి

రూ.72వేలకు పైనే వెండి

జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు ఉదయం సెషన్లో రూ.493.00 (-0.68%) తగ్గి రూ.72185.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,835.00 వద్ద ప్రారంభమై, రూ.72,849.00 వద్ద గరిష్టాన్ని తాకి, రూ.72,094.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.456.00 (-0.62%) తగ్గి రూ.73360.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.73,941.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.73,960.00 గరిష్టాన్ని, రూ.73,314.00 కనిష్టాన్ని తాకింది

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 1900 డాలర్ల దిగువకు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 12.05

(-0.63%) డాలర్లు తగ్గి 1,897.85 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,897.80 - 1,912.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.339 (1.20%) డాలర్లు పెరిగి 27.865 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.962 - 28.360 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

బంగారం భారీ షాక్, రూ.50,000 దిశగా పరుగులు: నేడు రూ.500కు పైగా జంప్ | Gold prices dipped by Rs 101 to Rs 49,218 per 10 gram at Mumbai retail market

Gold prices dipped by Rs 101 to Rs 49,218 per 10 gram at Mumbai retail market on continued weakness in the rupee and lacklustre global trend. The yellow metal retreated on better-than-expected US economic data, steady Treasury yield, firm dollar and increased risk appetite.
Story first published: Thursday, June 3, 2021, 13:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X