For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్కడ భారీగా తగ్గిన బంగారం ధర: హైదరాబాద్‌లో రూ.60,000 దిశగా, ఇక అంతకంటే ధర తగ్గదు...

|

బంగారం ధరలు చుక్కలనంటుతున్నాయి. శుక్రవారం ఎంసీఎక్స్‌లో పసిడి దాదాపు రూ.1,000 వరకు తగ్గి రూ.54876కు పరిమితమైంది. అంతకుముందు సెషన్‌లో పసిడి 10 గ్రాములు రూ.56,191కు చేరుకున్న విషయం తెలిసిందే. వెండి ఫ్యూచర్స్ 2 శాతం తగ్గి రూ.74,483కు పరిమితమైంది. అంతకుముందు కిలో రూ.77,949కు చేరుకున్న విషయం తెలిసిందే. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినప్పటికీ తాత్కాలికంగా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

రోజుకు రూ.800కు పైగా పెరుగుదల: పసిడి ర్యాలీ కొనసాగుతుందా అంటే?రోజుకు రూ.800కు పైగా పెరుగుదల: పసిడి ర్యాలీ కొనసాగుతుందా అంటే?

హైదరాబాద్‌లో రూ.60,000 సమీపంలో..

హైదరాబాద్‌లో రూ.60,000 సమీపంలో..

బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి చేరుకుంటున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి త్వరలో రూ.60వేలకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు రూ.59వేలకు చేరుకుంది. నిన్న రూ.58,700 పలికింది. ఈ రోజు (ఆదివారం) ఓ సమయంలో రూ.59,000 మార్క్ కూడా అందుకుంది. రూ.60వేలు చేరడానికి మరో రూ.వెయ్యికి అటుఇటుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో నిన్న బంగారం ధరలు 2 శాతం పడిపోయాయి. అయినప్పటికీ 2,000 డాలర్లకు పైగా ఉంది. స్పాట్ గోల్డ్ 2,072 పలికింది. అమెరికాలో నిరుద్యోగిత శాతం తగ్గుముఖం పట్టడం, అమెరికా డాలర్ తిరిగి పుంజుకోవడం వంటి వివిధ కారణాలు ఇందుకు కారణం. దేశీయ మార్కెట్లో ఈ క్యాలెండర్ ఇయర్‌లో బంగారం ధరలు 40 శాతానికి పైగా పెరిగాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో రిటైల్ మార్కెట్లు ఢీలపడ్డాయి.

2,000 మార్క్ దిగి రాకపోవచ్చు

2,000 మార్క్ దిగి రాకపోవచ్చు

కరోనా, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా అస్థిరత్వం నెలకొంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఇక 2,000 డాలర్లకు పైగానే ఉండే అవకాశముందని భావిస్తున్నారు నిపుణులు. కరోనా కారణంగా భారీగా పెరిగిన ధరలు మున్ముందు ధరలు తగ్గుతాయని కొంతమంది భావిస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో 2000 డాలర్ల్ మార్క్‌కు దిగి రాకపోవచ్చునని అంటున్నారు. త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. చైనా-అమెరికా ట్రేడ్ వార్. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మరోసారి ఆర్థికపరమైన ఆంక్షలకు మొగ్గు చూపే అవకాశాలు కొట్టిపారేయలేని పరిస్థితులు.

English summary

అక్కడ భారీగా తగ్గిన బంగారం ధర: హైదరాబాద్‌లో రూ.60,000 దిశగా, ఇక అంతకంటే ధర తగ్గదు... | Gold prices crash ₹1,000 in a day, Expected to stay above $2,000

The precious metal prices, however, remained above $2,000 a critical support level, showing the pullback in prices recorded recently might be for the short term.
Story first published: Sunday, August 9, 2020, 15:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X