For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.250 తగ్గిన బంగారం ధరలు, ఐనా రూ.46,500కు పైనే..

|

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. నేడు (ఏప్రిల్ 9) ఉదయం స్వల్పంగా తగ్గిన పసిడి, సాయంత్రం సెషన్‌కు రూ.250 వరకు క్షీణించింది. అయినప్పటికీ బంగారం ధరలు రూ.46,000కు పైనే ఉంది. వెండి ధరలు కూడా రూ.600 వరకు క్షీణించి రూ.67వేల స్థాయికి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ ధరలు స్వల్పంగా క్షీణించినప్పటికీ 1750 డాలర్లకు చేరువలోనే ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా 25 డాలర్లకు పైనే కదలాడుతోంది.

రూ.250 తగ్గిన బంగారం ధర

రూ.250 తగ్గిన బంగారం ధర

గత రెండు మూడు రోజుల్లో వెయ్యి రూపాయలకు పైగా పెరిగిన బంగారం నేడు కాస్త క్షీణించింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సాయంత్రం సెషన్‌లో రూ.243.00 (-0.52%) తగ్గి రూ.46595.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,766.00 ప్రారంభమైన ధర, రూ.46,887.00 గరిష్టాన్ని, రూ.46,314.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.253.00 (-0.54%) తగ్గి రూ.46816.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,998.00 ప్రారంభమైన ధర, రూ.47,140.00 గరిష్టాన్ని, రూ.46,533.00 కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.572 డౌన్

వెండి రూ.572 డౌన్

వెండి ధరలు కూడా తగ్గాయి. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.572.00 (-0.85%) తగ్గి రూ.66929.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,181.00 వద్ద ప్రారంభమై, రూ.67,456.00 గరిష్టాన్ని, రూ.66,371.00 వద్ద కనిష్టాన్ని తాకింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.568.00 (-0.83%) తగ్గి రూ.67950.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.68,260.00 ప్రారంభమైన ధర, రూ.68,410.00 వద్ద గరిష్టాన్ని, రూ.67,340.00 కనిష్టాన్ని తాకింది.

1750 దిగువకు బంగారం

1750 దిగువకు బంగారం

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు నిన్నటి వరకు భారీగా పెరిగి, నేడు కాస్త తగ్గాయి. అయినప్పటికీ 1750 డాలర్ల దిగువకు వచ్చింది. నేడు -12.75 (0.73%) డాలర్లు తగ్గి 1,745.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,731.05 - 1,758.15 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. 25 డాలర్లకు పైనే ఉంది. 0.277 (1.08%) డాలర్లు తగ్గి 25.308 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.012 - 25.552 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

రూ.250 తగ్గిన బంగారం ధరలు, ఐనా రూ.46,500కు పైనే.. | Gold price today: Yellow metal trades near Rs 46,800

Gold futures were trading with cuts on Friday but the damage was capped as a weakness in the dollar and Treasury yields offered support along with a surprise jump in US jobless claims.
Story first published: Friday, April 9, 2021, 22:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X