For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: రూ.48,000 సమీపంలో బంగారం ధర, వెండి రూ.70,000 దిగువనే

|

బంగారం ధరలు ఈ వారం పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు రూ.48,000 దిగువనే ట్రేడ్ అవుతోంది. గతవారం రూ.48,000 క్రాస్ చేసిన పసిడి, ఈ వారం కూడా ఈ మార్కు వద్ద ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.61.00 (0.13%) పెరిగి రూ.47,950.00 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.71.00 (0.15%) ఎగిసి రూ.48,237.00 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే గోల్డ్ ఫ్యూచర్స్ రూ.8200 తక్కువగా ఉంది. వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10,000 వరకు తక్కువగా ఉంది.

ఈ వారం రూ.48,000 పైకి చేరుకోవచ్చు

ఈ వారం రూ.48,000 పైకి చేరుకోవచ్చు

ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ మద్దతు ధర రూ.47,800 నుండి రూ.47,600, నిరోధకస్థాయి రూ.47,900 నుండి రూ.48,150. సిల్వర్ మద్దతు ధర రూ.68,700 నుండి రూ.68,100. నిరోధకస్థాయి రూ.69,500 నుండి రూ.70,000. బంగారం ధర రూ.47,500 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.48,100 వద్ద కొనుగోలు చేయవచ్చునని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధర ఈ వారం పెరిగి రూ.48,000 మార్క్ క్రాస్ చేసినప్పటికీ, స్వల్ప పెరుగుదలతో ముగిసే అవకాశాలు ఉన్నాయి. గతవారం కూడా గోల్డ్ ఫ్యూచర్స్ రూ.600 పెరిగింది.

కామెక్స్‌లో...

కామెక్స్‌లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1813 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ వారం 1800 డాలర్లకు పైనే ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ 1825 డాలర్ల మార్కుకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిల్వర్ ఫ్యూచర్స్ 26 డాలర్ల వద్ద ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

లాభాలు నిలబెట్టుకోలేక..

లాభాలు నిలబెట్టుకోలేక..

అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న భారీగా పెరిగినప్పటికీ ఆ తర్వాత దానిని నిలబెట్టుకోలేకపోయింది. ఎందుకంటే డాలర్ వృద్ధి నమోదు ప్రభావం పసిడిపై ఒత్తిడిని తగ్గించింది. అదే సమయంలో సిల్వర్ ఫ్యూచర్ కూడా లాభాల్లో ట్రేడ్ అయినప్పటికీ ఆ తర్వాత నష్టాల్లో ముగిశాయి. దేశీయ మార్కెట్లో నిన్న బంగారం పెరగగా, వెండి మాత్రం నష్టపోయి ముగిసింది.

English summary

Gold Price Today: రూ.48,000 సమీపంలో బంగారం ధర, వెండి రూ.70,000 దిగువనే | Gold Price Today: Yellow metal trades higher, resistance above Rs 48,000

Gold was trading higher in the Indian market on July 14 following a positive trend in international spot prices.
Story first published: Wednesday, July 14, 2021, 11:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X