బంగారం ధరలు నేడు (మే 11, మంగళవారం) స్వల్పంగా క్షీణించాయి. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.48,000కు సమీపంలోనే ఉంది. పసిడి నిన్న, నేడు ఓ సమయంలో రూ.48 వేలను తాకింది. అయితే ఆ తర్వాత కాస్త తగ్గింది. రూ.48,165 వద్ద బంగారం నిరోధకస్థాయిని ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. జూన్ గోల్డ్ మద్దతు ధర రూ.47,500 వద్ద ఉండవచ్చు. జూలై సిల్వర్ మద్దతు ధర రూ.70,800, నిరోధకస్థాయి రూ.72,920. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ బంగారంపై అంతగా ఎత్తిడి లేదు. దీంతో పసిడి అతి స్వల్పంగా తగ్గడం లేదా దాదాపు స్థిరంగా ఉంది.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.145.00 (-0.30%) తగ్గి రూ.47806.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,952.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,013.00 గరిష్టాన్ని, రూ.47,780.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.106.00 (-0.22%) తగ్గి రూ.48263.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,365.00 వద్ద ప్రారంభమై, రూ.48,442.00 గరిష్టాన్ని, రూ.48,226.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,000 పైకి సిల్వర్
వెండి ఫ్యూచర్ ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మధ్యాహ్నం సెషన్లో రూ.170.00 (-0.24%) తగ్గి రూ.71374.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,319.00 వద్ద ప్రారంభమై, రూ.71,725.00 గరిష్టాన్ని, రూ.71,276.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.143.00 (-0.20%) తగ్గి రూ.72509.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,480.00 ప్రారంభమైన ధర, రూ.72,666.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,421.00 కనిష్టాన్ని తాకింది.

1840 డాలర్ల దిగువకు...
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. 1840 డాలర్ల దిగువన ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1.25 (-0.07%) డాలర్లు తగ్గి 1.25 (-0.07%) డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,832.05 - 1,838.95 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. 0.043 (+0.16%) డాలర్లు తగ్గి 27.535 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.207 - 27.578 డాలర్ల మధ్య కదలాడింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications