For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం ధర, రూ.46,500 దిగువకు: వెండి ధర ఎలా ఉందంటే

|

బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ ఫ్యూచర్ సాయంత్రానికి మరింత డిపోయింది. దీంతో దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల పసిడి ధర రూ.46,500 దిగువకు వచ్చింది. వెండి ధరలు మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. సాయంత్రం సెషన్‌కు అతి స్వల్పంగా రూ.76 తగ్గి రూ.69,300 దిగువన కదలాడింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.9800 తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేల వరకు తక్కువగా ఉంది.

రూ.46,500 దిగువకు బంగారం

రూ.46,500 దిగువకు బంగారం

ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో బంగారం ధర నేడు సాయంత్రం సెషన్లో 300కు పైగా తగ్గింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.362.00 (-0.77%) తగ్గి రూ.46,440.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,808.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,857.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,268.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9,800 తక్కువ ఉంది. ఓ సమయంలో రూ.10వేల తక్కువకు పడిపోయింది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.335.00 (-0.71%) తగ్గి రూ.46,605 వద్ద ట్రేడ్ అయింది. రూ.46,925.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.46,967.00 వద్ద గరిష్టాన్ని, రూ.46,475.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి ధర ఎలా ఉందంటే

వెండి ధర ఎలా ఉందంటే

వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.76.00 (0.11%) తగ్గి రూ.69,265.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.69,611.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.69,896.00 వద్ద గరిష్టాన్ని, రూ.68,654.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ అతి స్వల్పంగా పెరిగింది. కిలో రూ.9.00 (0.01%) పెరిగి రూ.70,630.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.70,868.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.71,137.00 వద్ద గరిష్టాన్ని, రూ.70,000.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1800 డాలర్ల దిగువకు

1800 డాలర్ల దిగువకు

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నేడు భారీగా తగ్గాయి. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 12.95 (-0.72%) డాలర్లు పెరిగి 1792.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఈ సెషన్లో 1,782.25 - 1,812.80 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 6.62 శాతం తగ్గింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. ఔన్స్ ధర 0.167 (+0.60%) డాలర్లు పెరిగి 27.855 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.365 - 27.995 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

భారీగా తగ్గిన బంగారం ధర, రూ.46,500 దిగువకు: వెండి ధర ఎలా ఉందంటే | Gold Price Today: Yellow Metal Trades Below ₹ 46,400 Mark

Amid a slump in gold prices, domestic gold futures witnessed a volatile trading session on Wednesday, February 24. In the national capital, gold rates plunged ₹ 148 to Rs 46, 307 per 10 gm due to overnight selling in global prices.
Story first published: Wednesday, February 24, 2021, 22:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X