For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు, వెండి ధర రూ.1000 పతనం

|

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. క్రితం సెషన్(మంగళవారం, జూలై 28)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.63.00 (0.13%) పెరిగి రూ.47524.00 వద్ద ట్రేడ్ అయింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.121.00 (0.25%) ఎగిసి రూ.47741.00 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం భారీగా తగ్గింది. ఏకంగా రూ.66,000 స్థాయికి పడిపోయింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో రూ.1,001.00 (-1.49%) తగ్గి రూ.66120.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1,160.00 (-1.70%) తగ్గి రూ.67053.00 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో అంతకుముందు 1800 డాలర్ల దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ పెరిగింది. నేడు దాదాపు 7 డాలర్ల మేర పెరిగి 1807 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.206 డాలర్లు పెరిగి 24.858 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నిన్న ఓ సమయంలో గోల్డ్ ఫ్యూచర్స్ 1792 డాలర్లకు పడిపోయింది. కానీ నేడు మళ్లీ స్వల్పంగా పెరిగింది.

 Gold price today: Yellow metal jump, Silver down Rs 1000

బంగారం ధరలు నిన్న ఇలా ఉన్నాయి... ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.46,750, ముంబైలో రూ.46,660, చెన్నైలో రూ.45,040గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.47,660 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 1796 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు, వెండి ధర రూ.1000 పతనం | Gold price today: Yellow metal jump, Silver down Rs 1000

In New Delhi, the 22-carat gold is trading at Rs 46,750 per 10 gm, a change of Rs 200 over yesterday's prices.
Story first published: Wednesday, July 28, 2021, 9:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X