For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు, గతవారం రూ.600 వరకు డౌన్

|

బంగారం ధరలు గతవారం భారీగా క్షీణించాయి. గత సోమవారం రూ.48,000 మార్కు పైన ప్రారంభమైన గోల్డ్ ఫ్యూచర్ ధరలు వారం ముగిసేసరికి రూ.600 వరకు క్షీణించి రూ.47,500 దిగువకు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లోను గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల దిగువకు పతనమయ్యాయి. సిల్వర్ ఫ్యూచర్స్ దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.60,700 దిగువకు పడిపోగా, కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 22.500 డాలర్ల దిగువకు పడిపోయింది.

2 నెలల కనిష్టానికి

2 నెలల కనిష్టానికి

ఎంసీఎక్స్‌లో పసుపు లోహం పసిడి రెండు నెలల కనిష్టానికి పడిపోయింది. ఓ వైపు ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నప్పటికీ, ఫెడ్ వడ్డీ రేటు పెరుగుతుందనే హింట్ నేపథ్యంలో పసిడి క్షీణించింది. పసిడి 2022 తొలి అర్ధ సంవత్సరంలో భారీగా పడిపోయి, రెండో అర్ధ సంవత్సరంలో రూ.55,000కు చేరుకునే అవకాశాలు ఉంటాయని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా.

రూ.47,500 దిగువకు

రూ.47,500 దిగువకు

ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో దాదాపు స్థిరంగా ముగిసి, రూ.47,455 వద్ద ట్రేడ్ అయింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,580 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1790 డాలర్ల దిగువకు పతనమైనప్పటికీ, చివరి సెషన్‌లో ఏకంగా 7 డాలర్లు లాభపడింది. దీంతో 1795 మార్కు దాటింది. అయినప్పటికీ 1800 డాలర్ల దిగువన (1796.25) డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 3.13 శాతం క్షీణించింది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.8700 తక్కువగా ఉంది.

సిల్వర్ ఫ్యూచర్స్ కూడా డౌన్

సిల్వర్ ఫ్యూచర్స్ కూడా డౌన్

గతవారం రూ.62,500 పైన ప్రారంభమైన సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.2000 క్షీణించింది. చివరి సెషన్లో స్వల్పంగా రూ.241 పెరిగింది. అయినప్పటికీ మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,667 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.61,259 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ చివరి సెషన్లో 0.200 డాలర్లు తగ్గి 22.390 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

రెండు నెలల కనిష్టానికి బంగారం ధరలు, గతవారం రూ.600 వరకు డౌన్ | Gold price today: MCX yellow metal rate at 2 month low

Gold price on Friday on Multi Commodity Exchange (MCX) gained 0.01 per cent and closed at ₹47,455 per 10 gm levels. However, this rise in MCX gold rate was not enough to pare the slump in yellow metal price this week. Compared to its last Friday close of ₹48,083 per 10 gm, MCX gold price today is down ₹628 per 10 gm and it is close to its 2-month low.
Story first published: Sunday, January 9, 2022, 20:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X