For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగకు ముందు తగ్గుతున్న బంగారం ధరలు, భారీగా పెరిగి స్వల్ప తగ్గుదల

|

బంగారం ధరలు స్వల్పంగా క్షీణించాయి. గతవారం రూ.800 వరకు పెరిగిన పసిడి ధరలు ఈ వారం తగ్గుదలతో ప్రారంభమయ్యాయి. నేడు (సోమవారం, అక్టోబర్ 11) ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.122.00 (-0.26%) తగ్గి రూ.46915.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.121.00 (-0.26%) క్షీణించి రూ.47090.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.47,000 దాటింది. ఈ వారం అతి స్వల్ప తగ్గుదలతో లేదా స్థిరంగా ప్రారంభమైంది. అయినప్పటికీ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.47,000 సమీపంలోనే ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62,000 మరింత చేరువైంది. నేడు అతి స్వల్పంగా రూ.42 పెరిగింది. దీంతో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ ప్రారంభ సెషన్లో రూ.61843.00 వద్ద ట్రేడ్ అయింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.62271.00 వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టంతో రూ.9300 తక్కువగా ఉంది. పండుగకు ముందు పసిడి ధరలు కాస్త తగ్గడం కొద్దిగా ఊరట.

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు స్వల్పంగా క్షీణించింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1757 డాలర్ల దిగువకు పడిపోయింది. గోల్డ్ ఫ్యూచర్స్ 1.65 (-0.09%) డాలర్లు క్షీణించి 1,755.75 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.013 (+0.06%) డాలర్లు ఎగిసి 22.712 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్‌లో 1,751.20 - 1,761.10 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల గరిష్టం 1978.40 డాలర్లు కాగా, 52 వారాల కనిష్టం 1677.90 డాలర్లు. క్రితం సెషన్‌లో 1757.40 డాలర్ల వద్ద ముగిసింది. బంగారం ధర ఒక ఏడాదిలో దాదాపు పది శాతం క్షీణించింది.

Gold Price Today Drops Sharply: Over Rs 9,300 Down from Record High

డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఈ వారం రూ.47,000 దిగువకు వస్తే మరింత క్షీణించే అవకాశముందని, రూ.46,450 మద్దతు లభించవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరింత క్షీణిస్తే రూ.46,000 దిగువకు పడిపోవచ్చునని చెబుతున్నారు. అలాకాకుండా రూ.47,500 పైకి చేరుకుంటే రూ.47,500కు చేరుకోవచ్చునని, దానిని కూడా అధిగమిస్తే రూ.47,950 దిశగా వెళ్ళవచ్చునని చెబుతున్నారు. రూ.46,550 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని, రూ.46,670 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

English summary

పండుగకు ముందు తగ్గుతున్న బంగారం ధరలు, భారీగా పెరిగి స్వల్ప తగ్గుదల | Gold Price Today Drops Sharply: Over Rs 9,300 Down from Record High

Gold price in India continued to drop on Monday, tracking its international peers. Dip in US dollar prices and the anticipation of US Federal Reserve would start paring stimulus this year has kept the bullion under pressure in the last few weeks.
Story first published: Monday, October 11, 2021, 11:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X