For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిన్న భారీగా పెరిగి, నేడు స్థిరంగా బంగారం ధరలు, వెండి 3% జంప్

|

బంగారం, వెండి ధరలు హఠాత్తుగా షాకిచ్చాయి. బుధవారం (జనవరి 19, 2022) ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న దాదాపు రూ.500 వరకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో అయితే నిన్న ఉదయం 1810 డాలర్ల స్థాయిలో కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 1850 డాలర్ల సమీపానికి జంప్ చేసింది. వెండి కూడా 24 డాలర్లను క్రాస్ చేసింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ దాదాపు రూ.1400 పెరిగి, కొనుగోలుదారులకు షాకిచ్చింది. ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం కామెక్స్‌లో నిన్న 30 డాలర్లు, వెండి 3 శాతం లాభపడింది.

నిన్న భారీగా పెరిగి.. నేడు స్థిరంగా

నిన్న భారీగా పెరిగి.. నేడు స్థిరంగా

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు స్థిరంగా లేదా అతి స్వల్పంగా తగ్గాయి. నేడు(గురువారం, జనవరి 20) ప్రారంభ సెషన్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.35.00 (-0.07%) క్షీణించి రూ.48342.00 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.7.00 (-0.01%) తగ్గి రూ.48460.00 వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ నేడు కూడా పెరిగింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.152 లాభపడి రూ.64,557 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.152 తగ్గి రూ.64,557 వద్ద ట్రేడ్ అయింది.

ధరల్లో క్షీణత

ధరల్లో క్షీణత

బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8000 తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టం రూ.79,000తో పోలిస్తే రూ.14,000 తక్కువగా ఉంది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 1,838.30 - 1,844.25 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. 52 వారాల కనిష్టం రూ.1680 డాలర్లు, గరిష్టం 1922 డాలర్లు.

క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1843 డాలర్ల వద్ద ముగిసింది. ఏడాదిలో గోల్డ్ ఫ్యూచర్స్ 0.63 డాలర్ల మేర క్షీణించింది.సిల్వర్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 24.137 - 24.247 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో సిల్వర్ ఫ్యూచర్స్ 5.25 శాతం మేర క్షీణించింది.

నిరోధకం..

నిరోధకం..

ఎంసీఎక్స్‌లో బంగారం నిరోధకస్థాయి రూ.48,000 వద్ద కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారాన్ని రూ.48,500 టార్గెట్ ధరతో రూ.48,150 వద్ద కొనుగోలు చేయవచ్చునని, అలాగే రూ.47,800 టార్గెట్ ధరతో రూ.48,000 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు. స్పాట్ గోల్డ్ క్రితం సెషన్‌లో ఔన్స్‌కు 1839.36 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నవంబర్ 22వ తేదీ తర్వాత ఇది గరిష్టం.

English summary

నిన్న భారీగా పెరిగి, నేడు స్థిరంగా బంగారం ధరలు, వెండి 3% జంప్ | Gold price rallies 30 dollars, silver price surges more than 3 percent

Gold price rallies $30, silver price surges more than 3% as investors flock to safe-havens.
Story first published: Thursday, January 20, 2022, 10:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X