For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.49,000 స్థాయికి బంగారం, ధరలు పెరుగుతాయా?

|

బంగారం, వెండి ధరలు గతవారం క్షీణించాయి. బంగారం వచ్చే వారం ప్రారంభంలో 1960 డాలర్ల దిశగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. క్షీణిస్తే మాత్రం 1800 డాలర్ల నుండి 1750 డాలర్లకు పడిపోయే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. ఒకవేళ ధరలు పెరిగినా అంతగా పెరిగే అవకాశాలు తక్కువే అంటున్నారు. డాలర్ వ్యాల్యూ పెరుగుతుండటం, జోబిడెన్ భారీ ప్యాకేజీ వంటివి ప్రభావం చూపుతాయని అంటున్నారు. గతవారం పసిడి, వెండి ధరల ముగింపు ఇలా..

IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనంIMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం

రూ.49,200 దిగువనే

రూ.49,200 దిగువనే

గతవారం చివరి సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 258.00 (0.52%) క్షీణించి రూ.49,190.00 వద్ద ముగిసింది. రూ.49,355.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,399.00 వద్ద గరిష్టాన్ని, రూ.49,685.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7000 వరకు ఉంది. బంగారం ధరలు కొద్ది రోజులుగా రూ.50వేల సమీపంలోనే కదలాడుతున్నాయి.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 268.00 (0.54%) తగ్గి రూ.49,328.00 వద్ద ముగిసింది. రూ.49,561.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,587.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,868.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండి రూ.67వేల దిగువకు

వెండి రూ.67వేల దిగువకు

బంగారం ధరలు తగ్గగా, వెండి ఫ్యూచర్స్ కూడా అదే దారిలో నడిచింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 576.00 (0.86%) తగ్గి రూ.66724.00 వద్ద ముగిసింది. రూ.67,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,425.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

మే సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. రూ.642.00 (0.94%) క్షీణించి రూ.67520.00 వద్ద ముగిసింది. రూ.67735.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,839.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,456.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

1870 డాలర్ల దిగువకు పసిడి

1870 డాలర్ల దిగువకు పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర క్షీణించి 1860 డాలర్ల దిగువకు వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -10.60 (-0.57%) డాలర్లు తగ్గి 1,855.30 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్లో 1,836.45 - 1,870.80 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 16.08% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ పెరిగింది. ఔన్స్ ధర 0.302 (-1.17%) డాలర్లు తగ్గి 25.552 డాలర్ల వద్ద ముగిసింది. చివరి సెషన్లో 25.065 - 26.047 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 39.84శాతం పెరిగింది.

English summary

రూ.49,000 స్థాయికి బంగారం, ధరలు పెరుగుతాయా? | Gold Price Prediction: Prices Rise for the Week but Remain Rangebound

Gold markets broke down a bit during the trading session on Friday as the 50 day EMA has offered a significant amount of resistance.
Story first published: Sunday, January 24, 2021, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X