For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Prediction: గతవారం బంగారం ధర ఎంత తగ్గిందంటే?

|

ముంబై: బంగారం ధరలు గతవారం చివరి సెషన్లో పెరిగినప్పటికీ, మొత్తానికి తగ్గాయి. వారంలో 2.3 శాతం మేర క్షీణించింది. క్రితం వారం పసిడి ధరలు ఎనిమిది నెలల కనిష్టానికి చేరుకున్నాయి. ఆగస్ట్ 7వ తేదీ నాటి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే ఫ్యూచర్ గోల్డ్ రూ.10,000కు పైగా తక్కువగా ఉంది. దీర్ఘకాలంలో పెట్టుబడుల కోసం, అలాగే, ఏదైనా శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయమంగా చెబుతున్నారు.

కరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ తర్వాత పెన్షనర్లకు ఎన్నో ప్రయోజనాలుకరోనా ఎఫెక్ట్: లాక్‌డౌన్ తర్వాత పెన్షనర్లకు ఎన్నో ప్రయోజనాలు

పసిడిపై వీటి ప్రభావం

పసిడిపై వీటి ప్రభావం

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైనందున దీని ప్రభావాన్ని బట్టి పసిడి ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇటీవల డాలర్ కాస్త తగ్గింది. అలాగే దీర్ఘకాలిక అమెరికా ట్రెజరీ యీల్డ్స్ గరిష్టాన్ని తాకాయి. ఇది బంగారంపై ఒత్తిడిని పెంచుతున్నాయి. కరోనా నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, మరో ఆర్థిక ప్యాకేజీ అవసరమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెలెన్ అన్నారు. ఇది పసిడిపై ప్రభావం చూపుతుంది.

కొనుగోలు చేయవచ్చా?

కొనుగోలు చేయవచ్చా?

బంగారం ధరలు భారీగా పడిపోవడంతో ఇప్పుడు కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. సమీప కాలంలో మరింత తగ్గినా.. భారీగా తగ్గక పోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది కొనుగోలుకు సమయమని భావించవచ్చునని అంటున్నారు. బంగారం ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్టంతో రూ.10వేల కంటే పైన తక్కువగా ఉంది. కరోనా తగ్గుముఖం, వ్యాక్సినేషన్ ప్రకటనలు పాతబడిపోయినందున ఈ ప్రకటనలు ముందు ముందు బంగారంపై పెద్దగా పాజిటివ్ ప్రభావం చూపించకపోవచ్చునని అంటున్నారు.

నవంబర్ కనిష్టం వద్ద పరీక్ష

నవంబర్ కనిష్టం వద్ద పరీక్ష

బంగారం ధరలు నవంబర్ నెలలో ఓ సమయంలో ఔన్స్‌కు 1764 పలికింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ 1783 వద్ద ట్రేడ్ అయి, నవంబర్ కనిష్టంతో పరీక్షను ఎదుర్కొంటోంది. గత ఏడాది జూన్ నెలలో ఔన్స్ 1667 వద్ద ట్రేడ్ అయింది. మున్ముందు ఆ కనిష్టానికి పడిపోయే అవకాశాలు కొట్టిపారేయలేమని భావిస్తున్నారు.

English summary

Gold Price Prediction: గతవారం బంగారం ధర ఎంత తగ్గిందంటే? | Gold Price Prediction: Prices Consolidate Closing down the Week by 2.3 percent

Gold prices rebounded from session lows but ended the week down 2.3%. During the week prices slipped through trend line support and poised to test lower levels. The dollar moved lower, but long-term US treasury yields moved higher which continued to weigh on the yellow metal.
Story first published: Sunday, February 21, 2021, 10:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X