For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం ఈక్విటీ మార్కెట్, బంగారం ధరలు ఎలా ఉండవచ్చు?

|

దేశీయంగా కరోనా కేసులు తగ్గడం, జీడీపీ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా నమోదు కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గతవారం లాభాల్లో ముగిశాయి. భారత ఎగుమతుల్లో వృద్ధి, రుతుపవనాలపై సానుకూల అంచనాలు ఇందుకు జత కలిశాయి. గత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు మైనస్ 7.3 శాతానికి క్షీణించినప్పటికీ, నాలుగో త్రైమాసికంలో 1.6 శాతం వృద్ధి నమోదయింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచారు. మే నెలలో తయారీ పీఎంఐ 50.8, సేవల పీఎంఐ 46.4గా నమోదయ్యాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌కు సానుకూల పరిణామం.

బంగారాన్ని తీసుకోవడం లేదు, బ్యాంకులకు మరింత భారమే: వారు వేలం వేస్తున్నారు..బంగారాన్ని తీసుకోవడం లేదు, బ్యాంకులకు మరింత భారమే: వారు వేలం వేస్తున్నారు..

వాటిలో ప్రాఫిట్ బుకింగ్

వాటిలో ప్రాఫిట్ బుకింగ్

ఈ వారం కూడా మార్కెట్లు సానుకూలంగా కదిలే అవకాశాలు ఉన్నాయి. వర్షాకాలానికి ముందు నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవచ్చుననే అంచనాలతో సిమెంట్ షేర్లు రాణించే అవకాశముంది. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఆంక్షలు సడలించడం సానుకూలం. ఔషధ షేర్ల బలహీనతలు కొనసాగవచ్చు. దేశంలో కరోనా కేసులు తగ్గడం ఇన్వెస్టర్లు స్టాక్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి ప్రదర్శించడానికి వీలు ఉంది. కరోనా నేపథ్యంలో ఫార్మా స్టాక్స్ ఇటీవలి వరకు భారీగా ఎగిశాయి. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. ఈ వారం కూడా అది కొనసాగవచ్చు.

సానుకూలం

సానుకూలం

ఇంధన షేర్లు సానుకూల ధోరణితో స్వల్ప శ్రేణిలో కదలాడొచ్చు. రిఫైనరీ కంపెనీ షేర్లతో పోలిస్తే అప్‌స్ట్రీం కంపెనీల షేర్లు రాణించే అవకాశముంది. డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ముడిచమురు ధరలు పెరగడం ఇందుకు కారణం. గత వారం బ్యారెల్ చమురు 3 శాతం పెరిగి 71.8 డాలర్లకు చేరుకుంది. అమెరికా ఆర్థిక గణాంకాలు, ఐరోపా కస్టమర్ సెంటిమెంట్ మెరుగు, ఆసియా దేశాల పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకోవడం, ఉద్యోగాలు క్రమంగా పెరగడం ఈక్విటీ మార్కెట్‌కు, గోల్డ్ మార్కెట్‌కు సానుకూలం. సెన్సెక్స్ గతవారం 52,517 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టానికి చేరుకుంది. ఈ స్థాయి పైకి వస్తే మరింత ముందుకు కదలవచ్చు. మరోవైపు 51,000 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభిస్తుంది.

గోల్డ్ ఫ్యూచర్

గోల్డ్ ఫ్యూచర్

పసిడి ఆగస్ట్ కాంట్రాక్టుకు ఈవారం రూ.48,400 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఈస్థాయి కిందకు వస్తే రూ.47,790 వరకు దిగి వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం. రూ.49,660 స్థాయిని అధిగమిస్తే రూ.50,325 వరకు వెళ్లవచ్చు. ఇన్వెస్టర్లు 49,660 వద్ద స్టాప్ లాస్ పెట్టుకొని రూ.49,056కు దిగువన షార్ట్ సేల్ చేయవచ్చు.

English summary

ఈ వారం ఈక్విటీ మార్కెట్, బంగారం ధరలు ఎలా ఉండవచ్చు? | Gold Price and Market Forecast: Gold Markets Recover After Jobs Number

Gold markets initially fell during the trading session on Friday to reach down towards the crucial $1850 level but have seen the market turn right back around to show signs of strength.
Story first published: Monday, June 7, 2021, 10:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X