For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Price Today: రూ.300 తగ్గిన బంగారం ధర, వెండి మాత్రం పైపైకి...

|

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో చాన్నాళ్లకు 1800 డాలర్లు క్రాస్ చేశాయి. 1850 డాలర్ల దిశగా వెళ్లినప్పటికీ, 1840 డాలర్ల వద్ద దాదాపు స్థిరంగా కనిపిస్తోంది. 2021 ప్రారంభంలో 1950 డాలర్లకు సమీపంలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత మార్చి నెలలో 1700 డాలర్ల దిగువకు పడిపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఆందోళన కలిగిస్తోన్న పరిస్థితుల్లో ఆ తర్వాత నుండి పెరిగి ఇటీవలే 1800 డాలర్లు దాటి, 1850 డాలర్ల దిశగా కనిపించింది. అమెరికా డాలర్ క్షీణత, ఇటీవలి కాలంలో బాండ్ యీల్డ్స్ పడిపోవడం వంటి అంశాలు పసిడిపై ప్రభావం చూపుతున్నాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో నేడు ధరలు కాస్త తగ్గినప్పటికీ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.8800 తక్కువగా ఉంది.

వడ్డీ రేట్లను సవరించిన IDFC ఫస్ట్ బ్యాంకు, మే 1 నుండి అమల్లోకి: వడ్డీ రేటు వివరాలువడ్డీ రేట్లను సవరించిన IDFC ఫస్ట్ బ్యాంకు, మే 1 నుండి అమల్లోకి: వడ్డీ రేటు వివరాలు

తగ్గిన బంగారం ధర

తగ్గిన బంగారం ధర

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.311.00 (-0.65%) తగ్గి రూ.47640.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,952.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,013.00 గరిష్టాన్ని, రూ.47,325.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.221.00 (-0.46%) తగ్గి రూ.48148.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,365.00 వద్ద ప్రారంభమై, రూ.48,442.00 గరిష్టాన్ని, రూ.47,859.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.72,000 సమీపానికి వెండి

రూ.72,000 సమీపానికి వెండి

వెండి ఫ్యూచర్ ధరలు మాత్రం నేడు స్వల్పంగా పెరిగాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.236.00 (0.33%) పెరిగి రూ.71780.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,319.00 వద్ద ప్రారంభమై, రూ.71,885.00 గరిష్టాన్ని, రూ.70,886.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.210.00 (0.29%) పెరిగి రూ.72862.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,480.00 ప్రారంభమైన ధర, రూ.72,913.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,027.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు దాదాపు స్థిరంగా లేదా స్వల్పంగా తగ్గాయి. 1840 డాలర్ల దిగువనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 2.35 (0.13%) డాలర్లు తగ్గి 1,835.15 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,818.05 - 1,842.45 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం పెరిగింది. 0.130 (+0.47%) డాలర్లు తగ్గి 27.622 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.183 - 27.692 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

Gold Price Today: రూ.300 తగ్గిన బంగారం ధర, వెండి మాత్రం పైపైకి... | gold market yellow metal couldn’t surpass $1,800.

The gold market is a funny place. On Thursday (May 6), I complained that the yellow metal couldn’t surpass $1,800.
Story first published: Tuesday, May 11, 2021, 22:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X