For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices: బంగారం పైపైకి.. సెప్టెంబర్ నాటికి భారీ షాక్?

|

ముంబై: బంగారం ధరలు ఈ రోజు (జూలై 24, శుక్రవారం) స్వల్పంగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.32 శాతం ఎగిసి రూ.50,860 పలికింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.2 శాతం తగ్గి కిలో రూ.61,070 పలికింది. ఈ రోజు బంగారం ధరలు రూ.50,950 నుండి 51,200 మధ్య ప్రతిఘటన ఎదుర్కోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎంసీఎక్స్‌లో బంగారం ధర తొలిసారి రూ.50వేల మార్క్ దాటింది. అంతర్జాతీయ మార్కెట్లోను ధరలు పెరిగాయి.

టాప్ 4 ఐటీ కంపెనీల్లో తగ్గిన హెడ్ కౌంట్.. ఎందుకు, భవిష్యత్తేమిటి?టాప్ 4 ఐటీ కంపెనీల్లో తగ్గిన హెడ్ కౌంట్.. ఎందుకు, భవిష్యత్తేమిటి?

బంగారం ధరలు గరిష్టానికి...

బంగారం ధరలు గరిష్టానికి...

బంగారం ధరలు నిన్న సరికొత్త గరిష్టానికి చేరుకున్నాయి. గురువారం హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి రూ.52,400 పలికింది. అంతర్జాతీయంగా పసిడి ధరలు పెరగడం ఓ కారణమైతే, శ్రావణమాసం ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా డిమాండ్ పుంజుకుంది. ఢిల్లీలో 10 గ్రాముల పసిడి రూ.51,443 పలికింది. అంతకుముందు ముగింపు ధర రూ.50,941తో పోలిస్తే రూ.500కు పైగా పెరిగింది. ముంబైలో రూ.50,703 పలికింది. వెండి ధర మాత్రం గురువారం, నేడు స్వల్పంగా తగ్గింది.

1900 డాలర్లకు సమీపంలో..

1900 డాలర్లకు సమీపంలో..

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధరలు 1900 డాలర్లకు సమీపంలో ఉన్నాయి. న్యూయార్క్ కామెక్స్ మార్కెట్లో పసిడి ఔన్స్ 1,888 డాలర్ల వద్ద ఉంది. ఇంట్రాడేలో 1,890 డాలర్లకు చేరింది. గురువారం ఒక దశలో 1,898.34 డాలర్లకు పెరిగింది. అయితే సాంకేతికంగా కీలకమైన 1900 డాలర్ల మార్క్ సమీపంలో ట్రేడర్స్ లాభాల స్వీకరణకు దిగడంతో 1,878 డాలర్లకు తగ్గింది. కామెక్స్‌లో వెండి ఔన్స్ ధర 1% వరకు పడిపోయి 22.82 డాలర్ల వద్ద ఉంది.

త్వరలో 2000 డాలర్లకు..

త్వరలో 2000 డాలర్లకు..

ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి మరో 30 నుండి 40 డాలర్ల దూరంలో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో సెప్టెంబర్ నాటికి బంగారం ధరలు 2,000 డాలర్లకు చేరుకుంటుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా పుంజుకోవడంతో మన దేశంలోను పెరుగుతున్నాయి. కరోనా కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్నందున ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీ ప్యాకేజీకి సిద్ధమయ్యాయి. యూరోపియన్ దేశాలు ఇప్పటికే 750 బిలియన్ యూరోల ప్యాకేజీకి తెలిపాయి. అమెరికా కూడా ప్యాకేజీకి సిద్ధమవుతోంది. ఆరు ప్రధాన కరెన్సీలలో డాలర్ మారకం తగ్గింది. ఇలాంటి సంక్షోభం తలెత్తినప్పుడు బంగారంపై పెట్టుబడులు పెరగడం సహజం.

English summary

Gold prices: బంగారం పైపైకి.. సెప్టెంబర్ నాటికి భారీ షాక్? | Gold likely to face resistance around Rs 50,950-51,200, Nears $1,900

India Gold MCX August Futures trade in the green on July 24 but ease from record high registered in the previous trading session. After a strong rally, some consolidation or profit taking cannot be ruled out. On the upside, resistance is placed at Rs 50,950-51,200, suggest experts.
Story first published: Friday, July 24, 2020, 12:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X