For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా తగ్గిన బంగారం దిగుమతులు, పసిడి దెబ్బతో తగ్గిన వాణిజ్య లోటు

|

ఏప్రిల్ 2019 నుంచి డిసెంబర్ 2019 మధ్య బంగారం దిగుమతులు అంతకుముందు ఏడాది కంటే తగ్గిపోయాయి. ఈ తొమ్మిది నెలల్లో దిగుమతులు 6.77 శాతం తగ్గి 23 బిలియన్ డాలర్లకు పోయిపోయినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెలువరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు లక్ష్యానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత్‌ను మార్చిన కొన్ని బడ్జెట్‌లు ఇవే..భారత్‌ను మార్చిన కొన్ని బడ్జెట్‌లు ఇవే..

వాణిజ్య లోటు పడిపోయింది...

వాణిజ్య లోటు పడిపోయింది...

2018-19 ఆర్థిక సంవత్సరంలో అదే కాలంలో పసిడి దిగుమతుల వ్యాల్యూ 24.73 బిలియన్ డాలర్లు. ఇప్పుడు 23 బిలియన్ డాలర్లకు తగ్గింది.

తగ్గుముఖం పట్టిన బంగారం దిగుమతులతో వాణిజ్యలోటు 148.23 బిలియన్ డాలర్ల నుంచి 118 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది జూలై నుంచి బంగారం దిగుమతుల్లో ప్రతికూల వృద్ధి నమోదు చేసుకోగా అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రం పెరిగింది. డిసెంబర్ నెలలో కూడా 4 శాతం పెరిగాయి.

బంగారంపై సుంకం పెరిగింది..

బంగారంపై సుంకం పెరిగింది..

ఆభరణాలకు ఉన్న డిమాండ్ కారణంగా భారత్ బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. వ్యాల్యూ పరంగా చూస్తే ప్రతి సంవత్సరం 800 నుంచి 900 టన్నుల మేర బంగారం వచ్చి చేరుతోంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ (CAD)ను కట్టడి చేయడానికి కేంద్రం బంగారం దిగుమతులపై సుంకాన్ని 10% నుంచి 12.5% పెంచడం మంచి ఫలితాలను ఇచ్చింది. కానీ, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ మాత్రం ఈ సుంకాన్ని 4 శాతనికి తగ్గించాలని కోరుతోంది.

అంతకుముందు ఏడాదీ తగ్గుదల

అంతకుముందు ఏడాదీ తగ్గుదల

గత తొమ్మిది నెలల్లో ఆభరణాల ఎగుమతులు 6.4% తగ్గి 27.9 బిలియన్ డాలర్లకు పరిమితం కావడంతో సుంకం తగ్గించాలని ఇండస్ట్రీ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 2018-19లోనూ బంగారం దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 3 శాతం తగ్గి 32.8 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.

English summary

భారీగా తగ్గిన బంగారం దిగుమతులు, పసిడి దెబ్బతో తగ్గిన వాణిజ్య లోటు | Gold imports dip 6.77 pc during April to Dec 2019

The decline in imports has helped to narrow down trade deficit to USD 118 billion during the period. Gold imports, which have a bearing on the current account deficit (CAD), fell 6.77 per cent to USD 23 billion during the April-December period of the current financial year, according to data from the commerce ministry.
Story first published: Monday, January 27, 2020, 10:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X