For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పండుగ సమయంలో షాకిచ్చిన బంగారం ధర, ఎక్కడ కొనుగోలు చేయవచ్చు?

|

నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు నేడు(అక్టోబర్ 14, గురువారం) కాస్త క్షీణించాయి. నేటి ప్రారంభ సెషన్‌లో రూ.122.00 (-0.25%) క్షీణించి రూ.47794.00 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.93.00 (-0.19%) తగ్గి రూ.47986.00 వద్ద ట్రేడ్ అయింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్లో రూ.47,835.00 వద్ద గరిష్టాన్ని, రూ.47,783.00 కనిష్టాన్ని తాకింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.349.00 (-0.55%) క్షీణించి రూ.62538.00 వద్ద, మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.336.00 తగ్గి రూ.63024.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 3.75 డాలర్లు క్షీణించి 1790 డాలర్ల వద్ద సిల్వర్ ఫ్యూచర్స్ 0.147 డాలర్లు తగ్గి 23.023 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

నిన్న భారీగా పెరుగుదల

నిన్న భారీగా పెరుగుదల

బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నిన్న ప్రారంభ సెషన్‌లో స్థిరంగానే కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ సాయంత్రానికి భారీగా పెరిగాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా రూ.689 పెరిగి రూ.47,887 వద్ద క్లోజ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్ల సమీపానికి చేరుకుంది. క్రితం సెషన్‌లో 1794.70 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న ఓ సమయంలో రూ.47,999 వద్ద కూడా ట్రేడ్ అయింది. అంటే రూ.48,000 కేవలం రూపాయి మాత్రమే తక్కువ. అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కూడా నిన్న భారీగానే పెరిగింది. రూ.62,000 దిగువన ట్రేడ్ అయిన సిల్వర్ ఫ్యూచర్స్ నిన్న రూ.1254 పెరిగి రూ.62,840 వద్ద ముగిసింది. క్రితం సెషన్‌లో సిల్వర్ 23 డాలర్లకు పైన క్లోజ్ అయింది.

రూ.1500 పెరుగుదల

రూ.1500 పెరుగుదల

పసిడి ధరలు నిన్న దాదాపు రెండు శాతం మేర లాభపడింది. దీంతో ఒక నెల గరిష్టానికి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ వారం కాస్త సానుకూలంగా ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పండుగకు ముందు ఇటీవల బంగారం ధరలు భారీగా తగ్గాయి. కానీ అంతలోనే మళ్లీ పెరిగాయి. దీపావళికి ముందు ధరలు పెరిగితే కొనుగోలుదారులకు షాక్ అని చెప్పవచ్చు. కరోనా తీవ్రత తగ్గడం, వ్యాక్సినేషన్ పెరగడానికి తోడు పండుగ సీజన్ కావడంతో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. కానీ హఠాత్తుగా ధరలు పెరగడం ఇటు కొనుగోలుదారులకు, అటు అమ్మకందారులకు షాకింగ్. ఇటీవల రూ.46,000 స్థాయిలో ఉన్న పసిడి ధరలు ఇప్పుడు రూ.48,000 దిశగా ఉన్నాయి. అంటే ఈ కొద్ది రోజుల్లో రూ.1500 నుండి రూ.2000 పెరిగింది.

మద్దతు ధర, టార్గెట్ ధర

మద్దతు ధర, టార్గెట్ ధర

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మద్దతు ధర 1780-1766 డాలర్లు. నిరోధకస్థాయి 1804-1822 డాలర్లు. సిల్వర్ మద్దతు ధర 23.00-22.70 డాలర్లు. నిరోధకస్థాయి 23.44-23.64 డాలర్లు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ మద్దతు ధర రూ.47,700-47,550. నిరోధకస్థాయి రూ.48,100-48,330. సిల్వర్ మద్దతు ధర రూ.62,500-62,220. నిరోధకస్థాయి రూ.63,100-63,600. బంగారాన్ని రూ.47,550 వద్ద స్టాప్ లాస్‌తో రూ.48,200 టార్గెట్ ధరతో రూ.47,700 వద్ద కొనుగోలు చేయవచ్చునని సూచిస్తున్నారు.

English summary

పండుగ సమయంలో షాకిచ్చిన బంగారం ధర, ఎక్కడ కొనుగోలు చేయవచ్చు? | Gold gains 2% overnight, at 1 month high globally

Domestic gold and silver prices rose on Thursday tracking global benchmarks. Globally, the yellow metal was at a 1-month high after gaining 2 percent overnight.
Story first published: Thursday, October 14, 2021, 10:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X