For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.48,000 క్రాస్ చేసిన బంగారం ధర, వెండి ధరలు రూ.71,000 క్రాస్

|

బంగారం ధరలు నేడు(మే 7 శుక్రవారం) మళ్లీ పెరిగాయి. నిన్న రూ.600కు వరకు పెరిగిన బంగారం ధరలు, నేడు మరో రూ.200కు పైగా పెరిగాయి. నిన్న వెండి ఏకంగా రూ.2000కు పైగా పెరిగి రూ.71,000 పైకి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు భారీగా ఎగిసి, 1830 డాలర్ల పైకి చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ 27.500 డాలర్ల పైన కదలాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం, క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులకు ఆచితూచి వ్యవహరిస్తుండటం పసిడికి కలిసి వస్తోంది. దేశీయంగా ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో బంగారం రూ.8400 తక్కువగా ఉంది.

సాయంత్రానికి పెరిగిన ధరలు

సాయంత్రానికి పెరిగిన ధరలు

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.217.00 (0.46%) పెరిగి రూ.47812.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.47,654.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.48,050.00 గరిష్టాన్ని, రూ.47,520.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.305.00 (0.64%) పెరిగి రూ.48224.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.48,021.00 వద్ద ప్రారంభమై, రూ.48,420.00 గరిష్టాన్ని, రూ.47,871.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

రూ.71,500 దిగువకు పసిడి

రూ.71,500 దిగువకు పసిడి

వెండి ఫ్యూచర్ ధరలు నేడు కాస్త తగ్గింది. ఉదయం రూ.71,400 దిగువకు వచ్చింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ నేడు సాయంత్రం సెషన్లో రూ.306.00 (-0.43%) తగ్గి రూ.71375.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.71,650.00 వద్ద ప్రారంభమై, రూ.72,231.00 గరిష్టాన్ని, రూ.70,932.00 వద్ద కనిష్టాన్ని తాకింది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.394.00 (-0.54%) తగ్గి రూ.72307.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.72,833.00 ప్రారంభమైన ధర, రూ.73,180.00 వద్ద గరిష్టాన్ని, రూ.72,005.00 కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ మార్కెట్లో...

అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లోను బంగారం ధరలు భారీగా పెరిగాయి. 1831 డాలర్లను క్రాస్ చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ నేడు 15.75 (0.87%) డాలర్లు పెరిగి 1,831.45 డాలర్ల వద్ద కదలాడింది. నేటి సెషన్లో 1,813.45 - 1,844.40 డాలర్ల మధ్య కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా పెరిగింది. 0.046 (+0.17%) డాలర్లు పెరిగి 27.523 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 27.230 - 27.797 డాలర్ల మధ్య కదలాడింది.

English summary

రూ.48,000 క్రాస్ చేసిన బంగారం ధర, వెండి ధరలు రూ.71,000 క్రాస్ | Gold Futures Rises 0.4 percent On MCX, Silver Trades Marginally Lower

Gold futures contracts for delivery in June rose as much as 0.36 per cent to hit an intraday high of ₹ 47,770 on the Multi Commodity Exchange (MCX). In the spot market 24 carat gold also known as fine gold was sold at ₹ 46,999 per 10 gram, according to India Bullion and Jewellers Association (IBJA).
Story first published: Friday, May 7, 2021, 22:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X