For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల వరద, ఏకంగా రూ.3,500 కోట్లు రాక

|

ఈ ఏడాది తొలి అర్ధభాగంలో పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF)లలోకి రూ.3,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో సురక్షితమని భావించే ఇన్వెస్టర్లు వీటిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. 2019 జనవరి నుండి జూన్ మధ్యలో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుండి రూ.160 కోట్లు ఉపసంహరించుకోగా, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.

వర్క్ ఫ్రమ్ హోం: బెంగళూరులో టెక్కీలు ఖాళీ, వీటికి భలే డిమాండ్వర్క్ ఫ్రమ్ హోం: బెంగళూరులో టెక్కీలు ఖాళీ, వీటికి భలే డిమాండ్

క్లిష్ట పరిస్థితుల్లో స్టాక్ మార్కెట్, రుణ పత్రాల కంటే బదులు గోల్డ్ ఈటీఎఫ్‌లు బెట్టర్ అని చాలామంది భావిస్తున్నారు. దీంతో 2020 జూన్ నాటికి ఈ పథకాల నిర్వహణలోని పెట్టుబడుల వ్యాల్యూ (ఏయూఎం) రూ.10,857 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలని భారత మ్యూచువల్ ఫండ్స్ సంస్థ వెల్లడించింది. జూన్ నెలతో ముగిసిన ఆరు నెలల్లోనూ గోల్డ్ ఈటీఎఫ్ పథకాల్లో ఇన్వెస్టర్లు భారీగానే పెట్టుబడులు పెట్టారు.

Gold ETFs attract Rs 3,500 crore in H1 2020 on safe haven buying

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో రూ.3,530 కోట్ల పెట్టుబడులు పెట్టారు. మార్చిలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించినప్పటికీ ఏప్రిల్ నుంచి తిరిగి పెట్టుబడులు పెరిగాయి. కరోనా కారణంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు ఇలాగే కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. నెలలవారీగా చూస్తే జనవరిలో రూ.202 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1483 కోట్లు, మార్చిలో రూ.195 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ.731 కోట్లు, మే నెలలో రూ.815 కోట్లు, జూన్ నెలలో రూ.494 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2011 తర్వాత బంగారం ధర ఈ ఏడాదే భారీగా పెరుగుతోంది.

English summary

గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల వరద, ఏకంగా రూ.3,500 కోట్లు రాక | Gold ETFs attract Rs 3,500 crore in H1 2020 on safe haven buying

Gold exchange traded funds saw hefty net inflows of over Rs 3,500 crore in the first six months of this year as investors continued to hedge their exposure to riskier assets amid the COVID-19 crisis.
Story first published: Monday, July 13, 2020, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X