For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్

|

పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. గత కొద్ది రోజులుగా రూ.50,000కు సమీపంలోనే కదలాడుతున్న పసిడి ధరలు నేడు రూ.49,000 స్థాయికి దిగి వచ్చాయి. వెండి ధరలు రూ.66,000 స్థాయికి చేరుకున్నాయి. నేటి సెషన్లో పసిడి ధరలు ఓ సమయంలో రూ.800కు పైగా తగ్గింది. వెండి దాదాపు రూ.1900 వరకు క్షీణించింది. సాయంత్రం సెషన్‌లో బంగారం రూ.400, వెండి రూ.1000కి పైగా తగ్గింది. పసిడి ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.7,200 వరకు తక్కువగా ఉంది. ఉదయం పసిడి 1.6 శాతం మేర కూడా క్షీణించింది. బుధవారం నాటి లాభాలు నేడు తుడిచిపెట్టుకుపోయాయి.

ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయిఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి

రూ.49వేల దిశగా పసిడి

రూ.49వేల దిశగా పసిడి

నేడు సాయంత్రం సెషన్‌లో ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 403.00 (0.81%) క్షీణించి రూ.49,045.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,355.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,399.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,685.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7200 వరకు ఉంది. బంగారం ధరలు కొద్ది రోజులుగా రూ.50వేల సమీపంలోనే కదలాడుతున్నాయి.

ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 381.00 (-0.77%) తగ్గి రూ.49,215.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,561.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.49,587.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,868.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

వెండిది అదే దారి

వెండిది అదే దారి

బంగారంతో పాటు వెండి ఫ్యూచర్స్ కూడా తగ్గింది. కిలో సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి 1,060.00 (-1.58%) తగ్గి రూ.66240.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,000.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,000.00 వద్ద గరిష్టాన్ని, రూ.65,425.00 వద్ద కనిష్టాన్ని తాకింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ 962.00 (-1.41%) తగ్గి రూ.67200.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.67,735.00 వద్ద ప్రారంభమైన ధర, రూ.67,839.00 వద్ద గరిష్టాన్ని, రూ.66,456.00 వద్ద కనిష్టాన్ని తాకింది. వెండి ఆగస్ట్ నెలలో ఓ సమయంలో రూ.79వేలను తాకింది. ఇది ఆల్ టైమ్ గరిష్టం. ఈ ధరతో రూ.10వేలకు పైగా తక్కువగా ఉంది.

1854కు సమీపంలో పసిడి

1854కు సమీపంలో పసిడి

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పెరిగి 1850 డాలర్ల దిగువన ఉంది. గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ -11.50 (-0.62%) డాలర్లు తగ్గి 1,854.40 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,836.45 - 1,870.80 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో పసిడి ధర 17.81% శాతం పెరిగింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా తగ్గింది. ఔన్స్ ధర -0.337 (-1.30%) డాలర్లు పెరిగి 25.517 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 25.065 - 26.047 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో 43.53శాతం పెరిగింది.

English summary

భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్ | Gold Erasing Wednesday’s Advance, Yellow metal 1 percent lower

Gold is 1.6% lower this morning, as it is trading closer to its Wednesday’s low.
Story first published: Friday, January 22, 2021, 22:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X