For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇదో మినీ క్రాష్.. బంగారం దారుణ పతనానికి కారణాలివే: తగ్గినట్లేనా అంటే అనుమానమే!

|

అంతర్జాతీయ పరిణామాలకు రష్యా వ్యాక్సీన్ శుభవార్త తోడు కావడంతో బంగారం ధరలు అంతర్జాతీయంగా దారుణంగా పతనమయ్యాయి. మంగళవారం బంగారం ధరలు ఏకంగా 4.3 శాతం క్షీణించగా, వెండి 7.2 శాతం తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సూచనలు, కరోనా మహమ్మారి ప్యాకేజీలు, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, ప్రధానంగా వ్యాక్సీన్ గుడ్‌న్యూస్‌తో బంగారంపై ఒత్తిడి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది లాభాలు స్వీకరించేందుకు మొగ్గు చూపారు.

రష్యా వ్యాక్సీన్, లాభాలకు వారు మొగ్గు: ఎగిసి 'పడిపోయిన' బంగారంరష్యా వ్యాక్సీన్, లాభాలకు వారు మొగ్గు: ఎగిసి 'పడిపోయిన' బంగారం

ఏడేళ్లలో దారుణ పతనం తొలిసారి..

ఏడేళ్లలో దారుణ పతనం తొలిసారి..

మంగళవారం నాటి వివిధ పరిణామాలతో బంగారం ధరలు ఔన్స్ ధర నాలుగు శాతానికి పైగా పడిపోయాయి. ఏడేళ్లలో ఓ రోజు అత్యంత దారుణంగా పతనం కావడం ఇదే మొదటిసారి. వెండి ధర కూడా దారుణంగానే పతనమైంది. ఇటీవల వెండి అంతకంతకూ ఎగిసిపడింది. నిన్న మాత్రం ఏకంగా దాదాపు 8 శాతం పడిపోయింది. మార్చి నెల మధ్య నుండి అతిపెద్ద ఒకరోజు పతనం. ప్లాటినమ్ ఔన్స్ ధర 3.3 శాతం, పల్లాడియం 4.2 శాతం పడిపోయింది.

ఇదో మినీ క్రాష్...

ఇదో మినీ క్రాష్...

ఇదో మినీ క్రాష్‌లా కనిపిస్తోందని, రష్యన్ వ్యాక్సీన్ వార్తల ప్రభావం పడిందని, దీంతో ఈక్విటీ మార్కెట్ మరింత ఉత్సాహంగా కనిపిస్తోందని అంతర్జాతీయ మార్కెట్ అనలిస్ట్ ఎడ్వార్డ్ మోయా అన్నారు. స్పాట్ గోల్డ్ 4.1 శాతం పడిపోయి ఔన్స్ 1,943.54 డాలర్లకు దిగి వచ్చింది. శుక్రవారం ఇది 2,072 డాలర్ల కంటే పైకి చేరుకుంది. బంగారం ధరలు ఒకరోజు ఇంత దారుణంగా పడిపోవడం 2013 తర్వాత ఇదే మొదటిసారి అని చెప్పారు. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 3.9 శాతం తగ్గి 1,960 డాలర్లకు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థలు ఊహించిన దాని కంటే వేగంగా పుంజుకుంటున్న పరిణామాలు కూడా కనిపిస్తున్నాయంటున్నారు.

బంగారం ధరలు తగ్గుతున్నట్లేనా.. డౌటే

బంగారం ధరలు తగ్గుతున్నట్లేనా.. డౌటే

అమెరికాలో వివిధ కార్యకలాపాలు జూలై నెలలో నిపుణుల అంచనాలకు మించి పుంజుకున్నాయి. అలాగే అమెరికా సూచీలు దాదాపు రికార్డ్ గరిష్టం సమీపానికి చేరుకున్నాయి. గత కొద్ది నెలలుగా బంగారాన్ని ముందుకు నడిపించిన కారకాలు ఇప్పుడు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే రష్యా వ్యాక్సీన్ సక్సెస్ అయితే ఆ ప్రభావం మార్కెట్లపై బంగారంపై మరింత ఒత్తిడి తగ్గుతుందని చెబుతున్నారు. అయితే రష్యా వ్యాక్సీన్‌పై కొంతమంది అనుమానాలు లేవెనెత్తుతున్న నేపథ్యంలో పసిడి ధరలు తగ్గుముఖం పట్టినట్లుగా అప్పుడే భావించలేమనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఈ ధరల్లో ఇంతకుముందు ఉన్న పెరుగుదల మాత్రం కనిపించదని అంటున్నారు.

English summary

ఇదో మినీ క్రాష్.. బంగారం దారుణ పతనానికి కారణాలివే: తగ్గినట్లేనా అంటే అనుమానమే! | Gold crashes over 4 percent, Silver down 7.2 percent

Gold sank as much as 4.3% on Tuesday, facing its worst one-day rout in 7 years, as a return of risk appetite following encouraging economic numbers and hopes of new coronavirus relief package boosted the S&P 500 to near record highs.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X