For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అడ్డుపడిన వ్యాక్సీన్: రూ.3,000 తగ్గిన బంగారం ధర, భారీగా తగ్గిన వెండి ధర!

|

ఢిల్లీ: గత వారం చివరి వరకు ఎగిసిపడిన బంగారం ధరలు రెండు రోజులుగా స్వల్పంగా తగ్గాయి. అయితే ప్రపంచ మార్కెట్లు పుంజుకోవడం, వ్యాక్సీన్ వచ్చిందనే వార్తల నేపథ్యంలో పసిడి ధర మంగళవారం భారీగా తగ్గింది. బంగారం పెరుగుదలకు రష్యన్ వ్యాక్సీన్ అడ్డుగా నిలిచింది! దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX), వివిధ నగరాల్లో పసిడి, వెండి ధరలు పడిపోయాయి.

రష్యా వ్యాక్సీన్, లాభాలకు వారు మొగ్గు: ఎగిసి 'పడిపోయిన' బంగారంరష్యా వ్యాక్సీన్, లాభాలకు వారు మొగ్గు: ఎగిసి 'పడిపోయిన' బంగారం

హైదరాబాద్‌లో పసిడి ధర ఎంత అంటే?

హైదరాబాద్‌లో పసిడి ధర ఎంత అంటే?

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర ఆల్ టైమ్ హై రూ.58,700 పైకి చేరుకుంది. కానీ ఇప్పుడు ఇది రూ.54,600కు దిగి వచ్చింది. కిలో వెండి ధర రూ.76,000 పలికింది. ఇది ఏకంగా రూ.8,000 తగ్గి రూ.67వేలకు దిగి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్, భారత్ బయోటిక్ వ్యాక్సీన్లు విజయవంతమైతే మరింత క్షీణత ఉంటుందని భావిస్తున్నారు.

రూ.50,000 రావొచ్చు

రూ.50,000 రావొచ్చు

ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 2.75 శాతం పడిపోయి (రూ.1,429) రూ.50,500 చేరుకుంది. వెండి కిలో 7.14 శాతం పడిపోయి (రూ.4,776) రూ.62,158 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో రూ.1,300కు పైగా పడిపోయి రూ.54వేలకు పైగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో బంగారం ధరలు ఈ రోజు మరింతగా పడిపోవచ్చునని భావిస్తున్నారు. ఎంసీఎక్స్‌లో రూ.50,000కు రావొచ్చునని అంటున్నారు.

రూ.3,000 తగ్గుదల!

రూ.3,000 తగ్గుదల!

అంతర్జాతీయ మార్కెట్లో ఇటీవల పసిడి ధరలు ఔన్స్ 2,080కి చేరుకున్నాయి. ఇప్పుడు 2,000 డాలర్ల కిందకు దిగి వచ్చాయి. మంగళవారం పసిడి 1,939 డాలర్లకు పరిమితమైంది. మన గ్రాముల లెక్కన అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాములకు దాదాపు రూ.3,000 ధర తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1875 డాలర్ల వద్ద గట్టి మద్దతు ఉందని చెబుతున్నారు.

English summary

అడ్డుపడిన వ్యాక్సీన్: రూ.3,000 తగ్గిన బంగారం ధర, భారీగా తగ్గిన వెండి ధర! | Gold crash: Indian gold rate and silver price today

Gold prices in India fell today with futures on MCX by 3.0% to Rs. 50581.0 per 10 gram. In the previous session, gold was down 5.61% or about Rs. 1517.43 per 10 gram. On MCX, silver futures plunged nearly 6.0% or Rs.3777.3 per kg to the price level of Rs. 62955.0 per kg.
Story first published: Wednesday, August 12, 2020, 10:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X